అందమైన బంధం స్నేహం… జీవితాంతం తోడుండే ఒకే ఒక వ్యక్తి స్నేహితుడే అవుతాడు.. అలాంటి స్నేహం పొందిన వారు అదృష్టవంతులు. చాలా మందికి స్నేహితులు ఉంటారు. కానీ వారిలో ఒకరు మాత్రమే Best Fried అవుతాడు. ఆ స్నేహితుడు తన మిత్రుడి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడడు. స్నేహం విలువ ఎలా ఉంటుంది? అని ఎవరైనా ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడం కష్టం. దాని రుచిని అనుభవించాలని కొందరు అంటుంటారు. అలా అనుభవించినవారు ఎందరో ఉన్నారు. ఇద్దరు అమ్మాయిల మధ్య ఎలాంటి స్నేహం శాశ్వతంగా ఉంటుంది.. అనడానికి ఎన్నో కథలు ఉన్నాయి. కానీ ఈ స్టోరీ చదివితే మాత్రం నిజం అనిపిస్తుంది.
ఒక గ్రామంలో ఇద్దరు అమ్మాయిలు లత, సహస్ర చిన్ననాటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు కలిసే చదువుకున్నారు.. ఆడుకున్నారు.. సమయం తెలియకుండా మాట్లాడుకునేవారు. అలా వాళ్ల స్నేహం మధురంగా సాగింది.
ఒకరోజు లత కుటుంబ పరిస్థితుల వల్ల ఊరిని వదిలి నగరానికి వెళ్లింది. కొన్నాళ్లు గడిచిపోయింది. అయితే గ్రామం విడిచి వెళ్లిన లత.. సహస్రకు ఉత్తరాలు రాస్తూ ఉండేది. కానీ వాటికి సమాధానం రాలేదు. దీంతో బాధపడిని లత తన మిత్రత్వాన్ని కోల్పోయానేమో అనుకుంది.
ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, సహస్ర ఓ పనికోసం నగరానికి వెళ్లింది.. రాత్రి ఒక బుక్ స్టోర్‌లో వేరే వ్యక్తి పేరుతో వచ్చిన ఉత్తరాలను చూసి అవి లత రాసిన లేఖలే అని తెలుసుకుంది. అసలు విషయం ఏంటంటే.. సహస్ర కుటుంబం చిరునామా మారిన తర్వాత లత లేఖలు ఆమెకు అందలేదు. కానీ ఆమె మనసులో మాత్రం లత స్థానం ఎప్పుడూ మారలేదు.ఈ విషయం తెలుసుకున్న అనంతరం వారు కలిశారు. దీంతో వారు చాలా సేపు బాధపడ్డారు. ఇలా అందమైన బంధం ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుంది.





