ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోయిన్లు చేతిలో సినిమాలు ఉన్నంతసేపే వారి కెరీర్ ను చక్కబెట్టుకుంటారు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని చేజిక్కించుకొని సినిమాలు చేసుకుంటూ పోతారు. ఇక పెళ్లి విషయంలోనైతే వారికి నచ్చిందే చేస్తారు. ఇష్టపడిన వ్యక్తినే కోరుకుంటారు. వీరికి పెద్దవాళ్లు కూడా అడ్డు చెప్పరు. దీంతో కొందరు విదేశీయులను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇంకొందరు హీరోయిన్లయితే వయసు, భాష తేడా లేకుండా విదేశీయులు వివాహామాడారు. అలా విదేశీయులను పెళ్లి చేసుకున్నవారిలో టాలీవుడ్ కు చెందినవారూ ఉన్నారు. ఎవరెవరు తెలుగు హీరోయిన్లు విదేశీయులను పెళ్లి చేసుకున్నారో చూద్దాం..
ఇలియానా..దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ గోవా బ్యూటీ మొదటి సినిమాతోనే పేరు తెచ్చుకుంది. ఆ తరువాత కిక్,పోకిరి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్ గా అలరించింది. ఆ తరువాత సినిమాలు తగ్గిపోవడంతో ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ నీబోస్ అనే ఫొటోగ్రాఫర్ ను ప్రేమించారు. అయితే ఆ తరువాత పెళ్లి చేసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం కాదని ఇలియానా కొట్టి పారేసింది.
రిచా గంగోపాధ్యాయ..శేఖర్ కమ్ముల లీడర్ సినిమాతో బుగ్గ చెంపలతో పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత ప్రభాస్ సినిమా ‘మిర్చి’లో అలరించింది. ఆ తరువాత ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గాయి. అయితే తన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ గా ఉన్న జోయ్ లాంగ్ ఎలా తో ప్రేమలో పడింది. దీంతో ఆయనను పెళ్లి చేసుకొని అమెరికాలో స్థిరపడింది.
శ్రేయ.. తెలుగులో టాఫ్ హీరోయిన్ గా కొనసాగిన శ్రేయ ‘ఇష్టం’ సినిమాతో సినీ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత అగ్రహీరోల సరసన నటించింది. మెగాస్టార్ చిరంజీవితో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఈ భామ రష్యాకు చెందిన ఆండ్రీ కొచ్చవ్వు అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ తరువాత పెళ్లి చేసుకుంది. ఈయన టెన్నిస్ క్రీడాకారుడు. వీరు ప్రస్తుతం రష్యాలోనే ఉంటున్నారు. సినిమాల్లో నటించాలనుకున్నప్పుడు ఇండియాకు వస్తున్నారు.
ప్రియాంక చోప్రా.. బాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా కొనసాగిని ఈ బ్యూటీ హాలీవుడ్ సినిమాల్లోనూ నటించింది. తన అందచందాలతో ప్రపంచ వ్యాప్తంగా మంత్రముగ్దుల్ని చేసిన ప్రియాంక అమెరికాకు చెందిన పాప్ సింగర్, నటుడు అయిన నికోలస్ జన్నీ జోనస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రియాంక కంటే జోనస్ చిన్నవాడు. ప్రస్తతం ఇండియా, అమెరికాకు ట్రావెల్ చేస్తున్న ఈ భామ ఎక్కువగా హాలీవుడ్ సినిమాలకే ప్రిఫరెన్స్ ఇస్తోంది.
ప్రీతి జింటా.. తెలుగుతో పాటు హిందీలో సూపర్ టాప్ హీరోయిన్ ప్రితీ జింటా విదేశీయుడినే పెళ్లి చేసుకుంది. తెలుగులో రాజకుమారుడు సినిమాలో నటించిన ఈ భామ ఆ తరువాత వెంకటేశ్ తో ప్రేమంటే ఇదేరాలో తన నటనతో మెప్పించింది. ఆ తరువాత బాలీవుడ్లోనే కొనసాగింది. ఈమె అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కు చెందిన జెనె గుడ్ఎనఫ్ అనే పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకుంది.





