తెలుగు లెజండరీ యాక్టర్ కోట శ్రీనివాస్ మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటుగా మారింది. దశాబ్దాలుగా విలక్షణ పాత్రలో కనిపించిన కోట శ్రీనివాస్ రావు జూలై 13న ఉదయం 4 గంటలకు మరణించాడనే విషయం తెలిసి సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. కమెడియన్ గా, విలన్ గా, తండ్రిగా, మామగా.. సోదరుడిగా.. ఎన్నో పాత్రలు వేసిన ఆయన సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయన సినిమాల్లో ఎలా ఎంట్రీ ఇచ్చాడంటే?
కోటశ్రీనివాసరావు రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకున్నారంటే? – insightearth.in – Telugu News Portal
కోట శ్రీనివాస్ రావు ఎన్నో పాత్రలతో అలరించారు. అయితే ఆయన నటించిన తొలి సినిమా ఏదనే విషయం చాలా మందికి ఆసక్తిగా మారింది. 1978లో ఇప్పటి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ప్రాణం ఖరీదు’తోనే కోట శ్రీనివాస్ రావు ఇండస్ట్రీలోకి వచ్చారు. మొదట్లో ఎక్కువగా నాటక రంగంపైనే ఆసక్తి చూపిన ఆయన కాలం మారుతున్న కొద్దీ సినిమాల్లో నటించారు. అయితే సినిమాల్లో బహుముఖ పాత్ర వేసి విమర్శకులను సైతం మెప్పించారు. చివరిగా 2023లో మాయాబజార్ ఫర్ సేల్ అనే తెలుగు సినిమాలో నటించారు.అయితే ఆ తరువాత ఇతర భాషలకు చెందిన చిత్రాల్లో నటించారు. వీటిలో భాగంగా చివరిగా ‘సువర్ణ సుందరి’ సినిమాలో అలరించారు. మొత్తంగా 750కి పైగా చిత్రాల్లో నటించారు.


తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లోనూ కోట శ్రీనివాస్ సత్తా చాటారు. 1987లో ‘ప్రతిఘాత్’ అనే సినిమాలో కోట శ్రీనివాస్ మొదటిసారిగా హిందీలో నటించారు. ఆ తరువాత 2016లో ‘బాగీ’ సినిమాలో చివరిసారిగా కనిపించారు. బాలీవుడ్ లోనే కాకుండా తమిళంలో ‘సామి’, కన్నడంలో ‘లేడీ కమిషనర్’ సినిమాల్లో కనిపించారు.