Wednesday, June 25, 2025

ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే.. జనసేనకు ఎన్నంటే?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12న కొలువైంది. ఆరోజు చంద్రబాబుతో సహా 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో జన సేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు కాగా.. మిగతా వారు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. అయితే ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఎలాంటి శాఖలు కేటాయిస్తారోనన్న చర్చ జోరుగా సాగింది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ కు ఏ శాఖ అప్పగిస్తారోనని జనసైనికులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో శుక్రవారం చంద్రబాబు ఆయా మంత్రులకు శాఖలు కేటాయించారు. ఎవరెవరికి ఏ శాఖలు ఉన్నాయంటే?

  • చంద్రబాబు (ముఖ్యమంత్రి) – సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు
  • పవన్ కల్యాణ్(ఉపముఖ్యమంత్రి) – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ
  • లోకేష్ – మానవ వనరులు, ఐటీ, రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీ)
  • వంగలపూడి అనిత – హెూంశాఖ, విపత్తు నిర్వహణ
  • అచ్చెన్నాయుడు – వ్యవసాయ, అనుబంధ శాఖలు
  • కొల్లు రవీంద్ర – గనులు, జియాలజీ, ఎక్సైజ్
  • నాదెండ్ల మనోహర్ – ఆహార, పౌరసరఫరాలు
  • పొంగూరు నారాయణ – మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి
  • సత్యకుమార్ యాదవ్ – వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం
  • నిమ్మల రామానాయుడు – జలవనరుల అభివృద్ధి
  • ఎన్ఎండీ ఫరూక్ – న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం
  • ఆనం రామనారాయణరెడ్డి – దేవదాయ
  • పయ్యావుల కేశవ్-ఆర్థికం, ప్రణాళిక, వాణిజ్యపన్నులు, శాసనసభ వ్యవహారాలు
  • అనగాని సత్యప్రసాద్- రెవెన్యూ స్టాంపులు, రిజిస్ట్రేషన్లు
  • కొలుసు పార్ధసారధి – గృహనిర్మాణం, సమాచార శాఖ
  • డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి – సాంఘిక సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలు
  • గొట్టిపాటి రవికుమార్ – విద్యుత్ శాఖ
  • కందుల దుర్గేష్ – పర్యాటక, సాంస్క్రతిక, సినిమాటోగ్రఫీ
  • గుమ్మడి సంధ్యారాణి – గిరిజన సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమం
  • బీసీ జనార్దన్రెడ్డి – రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడులు
  • టీజీ భరత్ – వాణిజ్యం, పరిశ్రమలు, ఆహార శుద్ధి
  • ఎస్.సవిత – బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత
  • వాసంశెట్టి సుభాష్ – కార్మిక, ఫ్యాక్టరీలు, బీమా, వైద్య సేవలు
  • కొండపల్లి శ్రీనివాస్ – ఎంఎస్ఎంఈ, సెర్చ్ ఎన్ఆర్ఆర్ఎ వ్యవహారాలు
  • మండిపల్లి రామ్ ప్రసాల్రెడ్డి- రవాణా, యువజన, క్రీడలు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News