ఆషాఢ మాసం కారణంగా దాదాపు నెలరోజులు శుభకార్యాలు జరగలేదు. 2025 జూలై 25 అమవాస్య తరువాత రోజ.. హిందూ క్యాలెండర్ ప్రకారం.. జూలై 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాల్లో మనిగినవారు.. ఈ శ్రావణ మాసంలో నిమయ నిష్టలతో.. ఉపవాసాలు చేస్తూ దేవుళ్లును కొలుస్తారు.అంతేకాకుండా ఇప్పటి నుంచి శుభముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కొందర కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునేవారు.. శుభకార్యాలు నిర్వహించుకోవాలని అనుకునేవారికి.. ఈ నెల అనుకూలంగా ఉండనుంది. అయితే 2025 జాతకం ప్రకారం.. ఈ శ్రావణ మాసంలో ఏ రోజుల మంచి ముహూర్తాలు ఉన్నాయి? ఈ నెలలో వచ్చే పండుగలు ఏవో తెలుసుకుందాం..
2025 సంవత్సరంలో శ్రావణమాసం జూలై 25న ప్రారంభం అయి.. ఆగస్టు 20 వరకు కొనసాగుతుంది. శ్రావణ మాసంలో శుభ ముహుర్తాలు ఈ విధంగా ఉన్నాయి. జూలై 26, 30, 31 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే ఆగస్టు నెలలో 1,3,5,7,8,9,10,11,12,13,14, 17 తేదీల్లో మంచి రోజులు ఉన్నట్లు జాతకం తెలుపుతుంది. అయితే ప్రీ ప్లాన్ కోసం ఈ తేదీల్లో ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని అనుకునేవారు.. ముఖ్యంగా వివాహానికి సంబంధించిన విషయాలను పూర్తిగా తెలుసుకోవడానికి సమీప పండితులను కలిసి తెలుసుకోవడం మంచిది.
2025 సంవత్సరంలో శ్రావణమాసంతో పండగుల సీజన్ మొదలైనట్లే. ఈ నెలలో ఆగస్టు 7న గురువారం వరలక్ష్మీ వ్రతం నిర్వహించుకోనున్నారు. అలాగే ఆగస్టు 9న రక్షాబంధన్ (రాఖీ పండుగ), ఆగస్టు 11న సంకష్ట హరచతుర్థి జరుపుకోనున్నారు. అలాగే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రానుంది. శ్రావణ మాసం పూర్తయిన తరువాత భాద్రపద మాసం ప్రారంభం కానుంది. అయితే మిగతా నెలల కంటే శ్రావణమాసం మొత్తం హిందువులు నిష్టంగా ఉంటారు. ఈ నెలలో కొందరు ఎలాంటి మద్యం, మాంసం ముట్టకుండా దేవుళ్లను కొలుస్తారు.





