Wednesday, June 25, 2025

ఫ్లైట్ లో డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన మహిళ.. తీవ్ర విమర్శలు..

సోషల్ మీడియాలో పాపులర్ కావాలని చాలా మంది కోరుకుంటారు. ఈ క్రమంలో ఒకప్పుడు టిక్ టాక్ యాప్ ద్వారా వీడియోలు చేసేవారు. ఇప్పుడు యూ ట్యూబ్ షార్ట్స్ ద్వారా తమ ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు. అయితే కొన్ని వీడియోలు సరదా కోసం చేసినా.. అవి వివాదస్పదంగా మారుతూ ఉంటాయి. లేటేస్టుగా ఓ మహిళ ప్లైట్ లో చేసిన వీడియో పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ వీడియో వివరాల్లోకి వెళితే..

ఇండిగో కు చెందిన ఓ విమానం ముంబై నుంచి వారణాసికి వెళ్తుండగా సల్మా షేక్ అనే మహిళ ఓ తమిళ పాటకు డ్యాన్స్ చేస్తూ రీల్ చేసింది. అయితే అ ఫ్లైట్ లో చాలా మంది ప్యాసింజర్స్ ఉన్నారు. అయినా వారి మధ్యే ఈమె డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియోను గత ఏప్రిల్ లో ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేసింది. అప్పటి నుంచి ఈ వీడియోను చాలా మంది లైక్ చేస్తున్నారు. కానీ కొంత మంది మాత్రం ఇలాంటి ప్రమాదకరమైన వీడియో చేయడంపై అసహ్యం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News