ఒక గ్రామంలోని సర్వ అధికారాలు సర్పంచ్ కే ఉంటాయి. అందుకే అతడిని గ్రామ అధ్యక్షుడిగా భావిస్తారు. సర్పంచ్ ను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. అందుకే ఆయన ప్రజల మంచి కోసం పనిచేయాల్సి ఉంటుంది. గ్రామ సర్పంచ్ అనేది ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధి. గ్రామ అభివృద్ధి, నిధుల వినియోగం, ప్రజా సమస్యల పరిష్కారం వంటి కీలక బాధ్యతలు సర్పంచ్‌పై ఉంటాయి. అయితే సర్పంచ్ తన విధులను సరిగా నిర్వర్తించకపోతే, అవినీతి, అధికార దుర్వినియోగం లేదా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే, ప్రజలు ఆయనను బహిష్కరించవచ్చా? అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది.
ప్రజలు నేరుగా బహిష్కరించగలరా?
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం సర్పంచ్ తన అధికారాన్ని ఉపయోగించి గ్రామ అభివృద్ధికి పాటుపడాలి. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలి. కావల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. కానీ ఇవేవీ చేయకుండా అవినీతి లేదా నిధుల దుర్వినియోగం, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడం, గ్రామాభివృద్ధికి విరుద్ధంగా వ్యవహరించడం, ప్రజా విశ్వాసాన్ని కోల్పోవడం వంటి సందర్బాల్లో సర్పంచ్ ను తొలగించే అధికారం ఉంటుంది. అయితే గ్రామస్థులు నేరుగా సర్పంచ్ ను బహిష్కరించలేరు. కానీ ఆ సర్పంచ్ నచ్చకపోతనే గ్రామసభను ఏర్పాటు చేయడానికి 50 శాతం మంది ఒక్కటవ్వాలి. ఆ తరువాత వార్డు సభ్యులకు తమ సమస్యలు విన్నవించుకున్న తరువాత వార్డు సభ్యుల్లోని కనీసం మూడింట రెండు వంతుల సభ్యులు (2/3 మెజారిటీ) అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలి. మొదటగా, వార్డు సభ్యులు రాతపూర్వకంగా మండల ప్రత్యేకాధికారికి లేదా జిల్లా కలెక్టర్‌కు నోటీసు ఇవ్వాలి. ఆ తర్వాత ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఓటింగ్ జరగాలి. అవసరమైన మెజారిటీ లభిస్తే, జిల్లా కలెక్టర్ సర్పంచ్‌ను తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం – సెక్షన్ 37 & 38 ప్రకారం పదవి నుంచి తొలగించే అధికారాన్ని వినియోగిస్తారు.
మహారాష్ట్రలో సర్పంచ్ తొలగింపు
మహారాష్ట్రలో Kolhapur జిల్లా Kasba Beed గ్రామంలో గ్రామ పంచాయతీ సభ్యులు సర్పంచ్‌కి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో అతనిని పదవి నుంచి తొలగించారు. ఈ కేసులో 11 మందిలో ఎక్కువ సంఖ్యలో సభ్యులు సర్పంచ్‌పై అభిశంసన ప్రతిపాదనను పాటు పెట్టి, తగిన మెజారిటీని సేకరించి, గ్రామసభలో కూడా దీనిని ధృవీకరించారు. అందువల్ల Uttam Varute అనే సర్పంచ్‌ను తొలగించారు. మధ్యప్రదేశ్‌లోని Satna జిల్లాలో కూడా సర్పంచ్‌కి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం జరిగింది. ఇక్కడ 13 మంది ఉన్న గ్రామ పంచాయతీ సభ్యుల్లో 10 మంది అభిశంసన ప్రస్తావనకు ఓటు వేస్తూ సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించారు.





