దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సంబరాలు ఘనంగా సాగుతూ ఉంటాయి. ఈరోజంతా ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతారు. సాయంత్రం ఇళ్లు, వాణిజ్యసముదాయాల్లో లక్ష్మీపూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత బాణ సంచా కాలుస్తూ సంబరాల్లో మునిగితేలుతారు. అయితే దీపావళి అనగానే చాలా మందికి ఇవే తెలిసి ఉంటాయి. కానీ ఈ పండుగ పేరుతో ఓ గ్రామం ఉంది. అంతేకాకుండా ఈరోజు అందరూ ఇళ్లల్లో లక్ష్మీపూజలు చేస్తే.. ఈ గ్రామంలో మాత్రం ముందుగా పితృపూజలు చేస్తారు. ఆ తరువాత మిగతా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇంతకీ దీపావళి అనే పేరు ఉన్న గ్రామం ఎక్కడుంది? దీని చరిత్ర ఏంటంటే?
ఈ సంవత్సరం దీపావళి పూజలు ఎప్పుడు? ఆ రోజు ఈ వస్తువులను ఎందుకు కొనాలి? – insightearth.in – Telugu News Portal: ఆ గ్రామం పేరు దీపావళి.. ఈ పేరు రావడానికో చరిత్ర ఉంది.. అదేంటంటే?ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు వెళ్లగానే దీపావళి అనే ఊరు కనిపిస్తుంది. గార మండలంలో ఉన్న ఈ గ్రామానికి ఆ పేరు రావడం వెనక ఓ చరిత్ర ఉందంటే నమ్మశక్యం కాదు. అంతేకాకుండా విభిన్న ఆచారాలు పాటిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. సుమారు 3 వేల జనాభా ఉన్నఈ గ్రామంలో ఎక్కువ మంది సోనాడి కమ్యూనిటీకి చెందిన వారు ఉంటారు. అయితే ఇక్కడి ప్రజలు తమ పూర్వీకులను పూజించిన తరువాత దేవుళ్ల పూజలు చేస్తారు. అంతేకాకుండా కొత్త అల్లుళ్లు ఇంటికి వస్తే వారికి సపర మర్యాదలు చేసి సాగనంపుతారు.

ఈ గ్రామానికి దీపావళి పేరు రావడానికి ఓ చరిత్ర ఉంది. శ్రీకాకుళం కళింగ పాలనలో ఉండేదన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే వీరి తరువాత కూడా కొందరు రాజులు పాలించారు. ఓ రాజు కూర్మనాథ్ ఆలయాన్ని సందర్శించి తిరిగి వెళ్తుండగా స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో ఈ గ్రామానికి చెందిన కొంత మంది ఆ రాజును నిద్రలేపడానికి దీపాలు వెలిగించారు. ఆ తరువాత దేవుళ్లను వేడుకున్నారు.
దీంతో రాజుకు స్పృహ వచ్చింది. ఆ తరువాత ఇదే గ్రామం అని అడగ్గా.. తమ గ్రామానికి పేరు లేదని చెప్పారు. దీంతో తనని దీపాలతో బతికించారని, అందువల్ల మీ గ్రామాన్ని ఇక నుంచి దీపావళి అని పిలుచుకోండి.. అని ఆ గ్రామ ప్రజలకు రాజు చెప్పాడు. దీంతో అప్పటి నుంచి ఆ గ్రామాన్ని దీపావళి అని పిలుస్తున్నారు.
దీపావళి పేరుతో ఉన్న ఈ గ్రామంలో ఈ పండుగ రోజున సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటారు. అయితే ప్రతీ దీపావళి రోజున తమకు పేరు వచ్చిన చరిత్రను గుర్తు చేసుకుంటూ ఉంటారు.





