Tuesday, June 24, 2025

బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఓటమి.. కారణం ఏంటంటే?

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. అయితే ఈ పార్టీకి పోటీగా ఉన్న కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. ఈ పార్టీ తరుపు గత ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎంపీగా గెలిచి ప్రధాని అయిన విషయం తెలిసిందే. కానీ ఈసారి మాత్రం లేబర్ పార్టీ 400 సీట్లలో గెలిచేందుకు మార్గం సుగమం అయింది. ఇంగ్లండ్ తో పాటు స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ కలిపి మొత్తం 650 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. బ్రిటన్ లో అధికారంలో ఉండాలంటే 326 సీట్లలో గెలవాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే లేబర్ పార్టీ 400 మార్క్ ను దాటేసింది. దీంతో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి చెందినట్లేనని తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఆ పార్టీ తరుపున గత ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా ఉన్న రిషి సునాక్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. పార్టీ ఓటమికి తన బాధ్యతే అని అన్నారు. కాగా 14 ఏళ్లుగా కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. విదేశాల్లో ప్రధాని పార్టీ చేపట్టిన ఏకైక వ్యక్తిగా రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. అయితే కొన్ని విషయాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు బెడిసి కొట్టాయి. వలసల కట్టడి కారణంగా ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మరోవైపు ఎన్నికల ప్రచారంలో వివాద స్పద వ్యాఖ్యలు చేశారు. ఇక లేబర్ పార్టీ తరుపున కీర్ స్టార్మర్ ప్రధాని పదవి చేపట్టే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయన దేశ భవిష్యత్ మళ్లీ కనిపిస్తోందని వ్యాఖ్యలు చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News