మనం రోజు తినే ఆహారంలో కూరలు ఎంతో ప్రాధాన్యతను ఇస్తాయి. భోజనం మొత్తంలో అన్నం కంటే కూరలోనే ఎక్కువగా ప్రోటీన్లు, పోషకాలు ఉంటాయి. వీటిలో ఎక్కువ పోషకాలు కలిగిన వాటిని తీసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే ఒక్కోసారి వీటిని తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. తాజాగా కొన్ని కూరగాయలను శుభ్రం చేయడం విషయంలో నిర్లక్ష్యంగా ఉండడంతో ముగ్గురి ప్రాణాలు పోయాయి. అంతేకాకుండా మరోచోట ఆహారాన్ని నిల్వ ఉంచి తినడంతో చాలామంది ఆసుపత్రిలో పాలు కావాల్సి వచ్చింది. వీరిలోనూ ఒకరు మరణించారు. అసలు కూరగాయలు తినడం వల్ల మనుషులు ఎలా చనిపోయారు? అసలేం జరుగుతోంది?
కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా సిరవార తాలూకా కోకణి తిమ్మూపూర్ గ్రామానికి చెందిన రమేష్ నాయక్, అతని కూతుళ్లు దీప, నాగమ్మలు మంగళవారం ఆసపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రమేష్ నాయక్ భార్య పద్మ, మరో కూతురుచైత్ర, కుమారుడు కృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఇంట్లో విషాద సంఘటన జరగడానికి గోడు చిక్కుడు కూరే కారణం అయింది. రమేష్ నాయక్ తన పొలంలో కొంత భాగం కూరగాయల సాగు చేశాడు. ఇందులో గోడు చిక్కుడును పెంచాడు. అయితే ఆదివారం గోడు చిక్కుడును తీసుకొచ్చి కూరగా వండి తిన్నారు. అయితే అంతకుముందు రమేష్ నాయక్ పంటకు పురుగుల మందు కొట్టాడని, ఆ తరువాత వెంటనే వీటిని తీసుకొచ్చి తిన్నారని పోలీసులు తెలిపారు. వాస్తవానికి ఇలా పిచికారి చేసిన తరువాత వాటిని కొన్ని రోజుల పాటు అలాగే ఉంచాలని వ్యవసాయ నిపుణులు తెలుపుతున్నారు. లేదా వాటిని శుభ్రంగా కడగాలని అంటున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండడంతో ముగ్గురు ప్రాణాలే పోయాయి.
హైదరాబాద్ లో ఆర్టీసీ కాలనీలో ఉంటున్న సంతోష్ శ్రీనివాస యాదవ్, జస్మిత, లహరిలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వీరితో పాటు శ్రీనివాస యాదవ్ భార్య రజిత, ఆమె సోదరుడు సంతోష్ కుమార్ యాదవ్, ఆయన భార్య రాధిక, వారి కుమార్తెలు పూర్విక, క్రితగ్నలతో పాటు శ్రీనివాస యాదవ్ తల్లి గౌరమ్మలు చికిత్స పొందుతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో బోనాల పండుగ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం శ్రీనివాస యాదవ్ చికెన్, మటన్ తో పాటు బోటి కూరను ఇంటికి తీసుకొచ్చాడు. అయితే ఆదివారం మిగిలిన మటన్ కూరను ఫ్రిడ్జ్ లోపెట్టారు. మరుసటి రోజు ఉదయం ఫ్రిజ్ లో నుంచి తీసి వేడి చేసి తిన్నారు. దీంతో వీరు అస్వస్థతకు గురయ్యారు.
ప్రిడ్జ్ లో మటన్ నిల్వ ఉండడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా ఉన్న కూరను వెంటనే వేడి చేయడం ద్వారా అది విషంగా మారుతుంది. ఫలితంగా మనుషుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా దీనిని ఎక్కువ సేపు ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల పొడిబారి పోతుంది. రుచి కూడా కోల్పోయి ఉంటుంది. దీనిని కూర చేసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు వస్తాయి. అయితే ఇవి ఎక్కువ స్థాయిలో ఉండడం వల్ల ప్రాణాలకే ప్రమాదం ఉండే అవకాశం ఉంది.
అయితే మటన్ ను ఫ్రిడ్జ్ లో ఉంచే ముందు కొన్ని చిట్కాలు పాటించాలి. కూర వండని మటన్ ను ప్రిడ్జ్ లో నిల్వ ఉంచాలని అనుకునేవారు మటన్ ను బాగా శుభ్రం చేయాలి. ఇలా చేయకపోతే ఇందులో బ్యాక్టీరియా ఎక్కువగా తయారై పాడై పోతుంది. మటన్ ను అలాగే ఉంచకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నిల్వ ఉంచుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇలా కట్ చేసిన మటన్ ను వ్యాక్యూమ్ ప్యాక్ ను ప్రయత్నించండి.





