Thursday, February 6, 2025

ఈఫొటోలోని బాలుడు.. ఇప్పుడు మేకప్ లేని అందాల హీరో.. ఎవరో చెప్పుకోండి..

సినిమాల్లో నటించే హీరోల సినిమాల మధ్య పోటీ ఉంటుంది. కానీ రియల్ లైఫ్ లో వీరంతా ఒక్కటిగానే ఉంటారు. కొన్ని సందర్భంగాల్లో వీరు కలుసుకున్నప్పుడు సరదాగా ఫోజులిచ్చి ఫొటోలు దిగుతూ ఉంటారు. గతంలో చాలా సినిమా షూటింగ్ లు దగ్గర దగ్గరగా ఉండేవి. ఈతరుణంలో కొందరు హీరోలు, వారి పిల్లలను కలుసుకొనేవారు. అలా ఓసారి వెంకటేశ్ ఓ కుర్రాడిని ఎత్తుకొని ఫొటోకు ఫోజులిచ్చాడు. ఆ కుర్రాడుఎవరంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్.. మిల్కీబాయ్… నాని.. ఇలా సకల పేర్లతో పిలుచుకునే అందమైన హీరో ఎవరంటే మహేష్ బాబు అని ఎవరైనా చెబుతారు. అమ్మాయిల ‘రాజకుమారుడు’..గా.. అందంలో‘మురారి’ గా సినిమాల్లో కొనసాగుతున్న ఈ డైనమిక్ హీరో దాదాపు రెండు తరాల సినీ ప్రేక్షకులను వినోదాల్లో ముంచెత్తాడు. ‘టక్కరి దొంగ’లా నటిస్తూ.. సైలెంట్ యాక్షన్ ని మెప్పించిన ‘అతడు’.. ‘ఖలేజా’తో కామెడీని కూడా పండించాడు. మహేశ్ బాబు జీవిత ప్రత్యేకమైనది. సినిమా బ్యాక్ రౌండ్ ఉన్నా చదువును కొనసాగిస్తూనే సినిమాల్లో నటించాడు మహేశ్. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడైనా మహేశ్ తన సొంత నటనతో అన్ని వర్గాల వారిని మెప్పించాడు. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన గురించి మీకోసం..

చైల్డ్ ఆర్టిస్టుగానే సంచలనాలు..

1975 ఆగస్టు 9 ఘట్టమనేని మహేశ్ పుట్టిన రోజు. తెలుగు సినీ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ, ఇంద్రాదేవిల ముద్దుల కుమారుడు మహేశ్ చెన్నైలో జన్మించారు. అతి చిన్నవయసులోనే మహేశ్ సినీ ఆరంగేట్రం చేశాడు.1979లో దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన ‘నీడ’ చిత్రంలో రమేశ్ హీరో. ఇందులో బాలనడుడి స్థానంలో మహేశ్ నటించారు. 1983లో కృష్ణ నటించిన ‘పోరాటం’ సినిమాలో ఆయనకు తమ్ముడిగా నటించారు. ఈ సమయంలో ప్రముఖ దర్శక నిర్మాత డోన్డి మహేశ్ నటనను చూసి ఆశ్చర్యపోయాడు. తనకు ఎంతో భవిష్యత్తు ఉందని అభినందించాడు. ఆ తరువాత 1987లో కృష్ణ దర్శకత్వం వహించిన ‘శంఖారావం’ చిత్రంలో నటించారు. 1989లో ‘గూఢచారి117’ చిత్రంలో మెప్పించారు. అదే సంవత్సరంలో క్రుష్ణ, విజయశాంతి కలిసి నటించిన ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో మహేశ్ తొలిసారిగా డబుల్ రోల్ చేశారు. 1990లో బాలచంద్రుడు, అన్నాతమ్ముడు సినిమాలు తీసి గ్యాప్ తీసుకున్నాడు.

‘రాజకుమారుడు’ఎంట్రీ అలా..

లయోలా కళాశాలలో డీగ్రీ పూర్తి పూర్తిచేసిన మహేష్. 1999లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇందులో కృష్ణ కూడా నటించారు. ఆ తరువాత 2000 సంవత్సరంలో వచ్చిన యువరాజు,వంశీ సినిమాలు సక్సెస్ ను సాధించలేకపోయాయి. వంశీ సినిమాలో హీరోయిన్ గా నటించిన నమ్రతా శిరోద్కర్, మహేశ్ ఈ సినిమాతో ప్రేమలో పడ్డారు. ఇక రెండు అపజయాలు సాధించిన సినిమాల తరువాత మళ్లీ మహేశ్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. 2001లో కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘మురారి’లో మహేశ్ రోల్ ను విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. దీంతో మహేశ్ టాప్ హీరోల ప్లేసులోకి వెళ్లిపోయాడు. అయితే 2002లో వచ్చిన ‘టక్కరిదొంగ’, ‘బాబీ’లు మళ్లీ బ్రేక్ నిచ్చాయి.

స్టార్ ఇమేజ్ తెచ్చని ‘ఒక్కడు’..

2003లో ‘ఒక్కడు’ సినిమాతో మళ్లీ మహేశ్ ను విజయం వరించింది. ఇలా రెండు సినిమాల గ్యాప్ తో మహేశ్ సినీ ప్రస్తానం సాగింది. అయితే ఒక్కడు సినిమాతో మహేశ్ కెరీర్ మలుపు తిప్పిందని చెప్పవచ్చు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మహేశ్ ‘ప్రిన్స్’గా మారాడు. అంతేకాకుండా ఒక్కడు సినిమాను మూడు భాషల్లో రిమేక్ కావడంలో ఆయన ప్రయారిటీ మరింతగా పెరిగింది. అదే సంవత్సరంలో మహేశ్ ‘నిజం’ సినిమా చేశాడు. ఈ సినిమా ప్లాప్ అయినా ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఇక ‘నాని’, ‘అర్జున్’ సినిమాలు సాదాసీదా నడిచాయి. అయినా మహేశ్ నటనపై అందరూ ప్రశంసలు గుప్పించారు.

బిగ్గెస్ట్ హిట్టు ‘అతడు’..

2005లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అతడు’ మహేశ్ బిగ్గెస్టు హిట్టు సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో మహేశ్ ను అతడుకు ముందు, అతడుకు తరువాత అని కీర్తిస్తారు. 12 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 25 కోట్ల రూపాయలు తెచ్చిపెట్టడం విశేషం. కాగా అప్పటికే ప్రేమలో ఉన్న మహేశ్ ఈ సినిమా షూటింగ్ సమయంలో నమ్రతను వివాహం చేసుకున్నారు. అనంతరం 2006 ఏప్రిల్ 20న పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ తెలుగు సినిమా కలెక్షన్ల రికార్డులను కొల్లగొట్టింది. కాగా ఈ సినిమా 75 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది. అంతేకాకుండా పోకిరి సినిమాకు నిర్మత మహేశ్ అక్క మంజుల కావడం విశేషం. ఈ సినిమాతో మహేశ్ ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగారు. ఇదే సంత్సరం మహేశ్, నమ్రతలకు కొడుకు గౌతమ్ క్రుష్ణ ఆగస్టు 31న జన్మించాడు. 2006లో మహేశ్ కెరీర్లో మరిచిపోలేని సంవత్సరంలగా నిలిచింది.

ఒక హిట్టు.. రెండు ప్లాప్ లు..

ఇక మహేశ్కు రెండు సినిమాల పరాజయం తరువాత హిట్టు సినిమా ఉంటుందనే సంప్రదాయం కొనసాగింది. 2011లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘దూకుడు’ భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఈ సినిమా 35 కోట్ల రూపాయలతో నిర్మించినా 101 కోట్ల కలెక్షన్లు తెచ్చిపెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా ఈ సినిమా కార్యాలయంలో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేశారంటే ఎంత వసూలైందో అర్థం చేసుకోవచ్చు. 2012లో వచ్చిన ‘బిజినెస్ మ్యాన్’ పర్వాలేదనిపించింది. ఇదే సంవత్సరంలో మహేశ్ మరోసారి తండ్రి అయ్యాడు. ఈ దంపతులకు కూతురు సితార జన్మించింది. 2013లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’సినిమాను ప్రముఖ నటుడు వెంకటేశ్ తో కలిసి నటించాడు. 2014లో వచ్చిన నేనొక్కడినే, ఇదే సంవత్సరంలో వచ్చిన ఆగడు పెద్దగా ఆడలేదు.

వ్యాపార రంగంలోనూ మహేష్..

ఇక మళ్లీ 2015లో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమాతో మహేశ్ సోలో హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా బంపర్ హిట్టు కొట్టింది. ఆ తరువాత 2016లో ఫ్యామిలీ సినిమాగా వచ్చిన బ్రహ్మోత్సవం డిజాస్టర్ ను తెచ్చిపెట్టింది. 2017లో వచ్చిన మురుగుదాస్ సినిమా ‘స్పైడర్’లో మహేశ్ కొత్తగా నటించినా సినిమా విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక 2018లో భరత్ అనే నేను మళ్లీ విజయం సాధించింది. ఆ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి కొత్త ఒరవడిని స్రుష్ఠించింది. ఇక ఇదే సమయంలో మహేశ్ ఏఎంబి అనే మల్టీ ప్లెక్స్ ను ప్రారంభించారు. 2020లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సైతం బ్లాక్ బస్టర్ సాధించింది. అయితే ఆ తరువాత వచ్చిన కరోనా కారణంగా వసూళ్లు రాబట్ట లేకపోయింది. కానీ ఇతర డిటిటల్ ఫాం పై ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

అంతా నమ్రతనే..

మహేశ్ తన జీవితంలో కేవలం సినిమాల్లో మాత్రమే నటిస్తాడట. మిగతా ఆర్థిక విషయాలన్నీ ఆయన సతీమణి నమ్రత చూసుకుంటుందట. తన కాల్షీట్లన్నీ నమ్రతే చూసుకుంటుంది. మహేశ్ బాబుకి ఇద్దరు అక్కలు. పద్మావతి, మంజుల. చెల్లెలు ప్రియదర్శిని. అన్నయ్య రమేశ్ బాబు. మహేశ్ ఊటీలో ఎక్కువగా చదివాడు. వాళ్ల అమ్మమ్మ దగ్గర ఉంటూ సామాన్యుడిలా పెరిగాడు. క్రుష్ణ కు స్వయాన మేనమామ కూతురు అయిన ఇందిరాదేవిని వివాహం చేసుకున్న తరువాత విజయనిర్మల ప్రేమలో పడ్డాడు. అయితే ఈ విషయాన్ని ఇంద్రాదేవికి చెప్పిన తరువాతే విజయనిర్మలను వివాహం చేసుకున్నారు. కానీ ఇందిరా దేవి మళ్ల పెళ్లి చేసుకోలేదు. ఒక చిన్న గొడవ కారణంగా ఇందిరాదేవి క్రుష్ణకు దూరమైంది. ప్రతీ వీకెండ్ ఫంక్షన్లో వీరంతా కలుసుకుంటారు.

మేకప్ లేని అందాల హీరో..

మహేశ్ 1999లో వచ్చిన రాజకుమారుడు, 2002లో వచ్చిన నిజం, 2005లో వచ్చిన అతడు, 2011లో వచ్చిన దూకుడు 2015లో వచ్చిన శ్రీమంతుడు సినిమాలకు నంది అవార్డులు వచ్చాయి. అలాగే 5 ఫిలిఫేర్ అవార్డులు వచ్చాయి. అన్ని రకాల రోల్ చేయడంలో మహేశ్ ది ప్రత్యేకత. ఎక్కువగా ఫ్యామిలీ సినిమాల్లో అలరించిన మహేశ్ స్పైడర్, నేనొక్కడినే, నిజం లాంటి ప్రత్యేక పాత్రల్లో అలరించాడు. అయితే మేకప్ ఏ మాత్రం అవసరం లేకుండా అందాల బాలుడిగా అలరిస్తున్న మహేశ్ మరిన్నీ సినిమాలు చేయాలని ఆశిద్దాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News