బంగ్లాదేశ్ లో విద్యార్థులు అనుకున్నది సాధించారు. తమ నిరసనలతో షేక్ హసీనాను రాజనామా చేయించిన తరువాత ప్రభుత్వం అంతా సైన్యం చేతుల్లోకి వెళుతుందని భావించారు. ఆ తరువాత రకరకాల పేర్లు ప్రధాని బాధ్యతలు చేపడుతారని వార్తలు వచ్చాయి. కానీ చివరికి నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనసాగనుంది . ఈ విషయాన్ని మంగళవారం అర్దరాత్రి దాటాక అధ్యక్ష కార్యాలయం ప్రకటన చేసింది. దాదాపు ఆరు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలికంగా నోబెల్ అవార్డు గ్రహీత యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా వ్యవహరిస్తారని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మహ్మదు యూనస్ ఎవరు? ఆయన కు నోబెల్ అవార్డు ఎందులో వచ్చింది?
మహమ్మద్ యూనస్ కు 2006లో నోబెల్ బహుమతి వచ్చింది. ఆయన 1940లో తూర్పు బెంగాల్ లోని చిట్టాగాంగ్ లో జన్మించారు. పలు దేశాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. గ్రామీణ బ్యాంకులను స్థాపించి మైక్రో క్రెడిట్, మైక్రో ఫైనాన్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేశారు. మొత్ంగా ఆర్థికవేత్తగా మారాడు. ఈ విషయాలపై ఆయన చేసిన పరిశోధనలకు నోబెల్ బహుమతి లభించింది. 2009లో అమెరికా ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ప్రీడమ్ అవార్డు అందుకున్నారు.
ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక ఓ 26 ఏళ్ల యువకుడి పేరు వినిపిస్తోంది. ఆయన పేరు నహీద్ ఇస్లాం. 1998లో ఢాకాలో జన్మించిన ఈయన ఆ తరువాత ఢాకా యూనివర్సిటీలో సోషియాలజీ చదువుతున్నారు. గత నెలలో ఇతడిని పోలీసులు అరెస్టు చేశారు. రోడ్డుపై ఇతడిని కొట్టడం, వివిధ చర్యల వల్ల పాపులర్ అయ్యారు. ఆ తరువాత విద్యార్థి సంఘాలను సమన్వం చేయడంలో సఫలీకృతుడయ్యారు.