మొంథా తుఫాను కారణంగా వరదలు చాలా ప్రాంతాలను ముంచేశాయి . వేలాది మంది ప్రజలు.. వరంగల్, హన్మకొండలోని సమ్మయ్య నగర్, హుస్నాబాద్ పరిసర గ్రామాల్లో వందలాది ఇల్లు పూర్తిగా నీటమునిగాయి. పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి శుక్రవారం హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారాపంట పొలాలను పరిశీలించారు. అలాగే వరంగల్ జిల్లాలోని సమ్మయ్య నగర్ లోని దెబ్బతిన్న నాలాలను పరిశీలించారు.
మొంథా తుఫాను కారణంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో చేతికొచ్చే సమమయంలో వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. కొందరు రైతులు ధాన్యం ఆరబోయడంతో అవి వాన నీటికి కొట్టుకుపోయాయి. పంటలు ధ్వంసం అయ్యాయి. దీంతో వరంగల్ జిల్లాలో బాధితులను సీఎం పరామర్శించారు.





