Wednesday, June 25, 2025

ఎయిర్ పోర్టు తరహాలో రైల్వే స్టేషన్లలోనూ బ్యాగ్ స్క్రీనింగ్ మెషిన్.. ఇంకేం మార్పులు ఉంటాయంటే?

దక్షిణమధ్య రైల్వేలోని చెన్నై తరువాత సికింద్రాబాద్ రైల్వేస్టేష్ కు ప్రాధాన్యం ఉంది. 1874లో నిజాం కాలంలో ఏర్పాటైన ఈ స్టేషన్ నుంచి దాదాపు ప్రతిరోజూ 700లకు పైగా ట్రైన్స్ రన్ అవుతూ ఉంటాయి. దాదాపు 1,70,000 మంది ప్రయాణికులు జర్నీ చేస్తుంటారు. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంటోంది. సామాన్యుల నుంచి ధనిక వర్గాల వారికి రైలు ప్రయాణం అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. అందుకే చాలా మంది ట్రైన్ జర్నీపై ఆధారపడుతూ ఉంటారు. అయితే ఇటీవల సికింద్రా బాద్ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇందు కోసం రూ. 700 కోట్టు బడ్జెట్ ను కేటాయించారు. అయితే కొత్త రైల్వే స్టేషన్ లో ఎలాంటి మార్పులు ఉంటాయంటే?

కొత్తగా రూపాంతరం చేసుకున్న రైల్వే స్టేషన్లో కొన్ని నిబంధనలు మార్చనున్నారు. ప్రస్తుతం ఉన్న రైల్వేస్టేషన్ లోకి ప్రయాణికులు ఎవరైనా ఎంట్రీ ఇవ్వొచ్చు. అలాగే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్నేహితులు, బంధువులు రైలు వచ్చే వరకు వెళ్లొచ్చు. కానీ ఇకనుంచి అలా కుదరరు. వీరు తమ కుటుంబ సభ్యులతో కలిసి మెయిన్ డోర్ వరకు మాత్రమే రావాల్సి ఉంటుంది. ఆ తరువాత టికెట్ ఉన్న ప్రయాణికులు కాంకోర్స్ మీదుగా వెయిటింగ్ హాల్ లోకి వెళ్లాలి. రైల్ అనౌన్స్ మెంట్ కు ముందు మాత్రమే స్టేషన్ పైకి రావాల్సి ఉంటుంది.

ప్రయాణాలు చేసేవారి బ్యాగ్ చెకింగ్ చేసే పద్ధతి ఇప్పటి వరకు ఎయిర్ పోర్టుల్లోనే చూశారు. ఇక నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లలోనూ ఇది ఉండనుంది. స్టేషన్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు రెండు ప్లాట్ ఫాం ద్వారా బ్యాగ్ చెకింగ్ చేసుకోవాలి. ఈ మెషిన్ కోసం రూ. 3 కోట్లు ప్రత్యేకంగా కేటాయించనున్నారు. సాధారణంగా రైలు బయలుదేరే ముందు వరకు స్టేషన్ లోకి ఎంట్రీ ఇచ్చి రైలు ఎక్కుతుంటారు. కానీ ఇకపై అలా కుదరదు. బ్యాగ్ చెకింగ్ చేసుకునే సమయంలోనే రైలు అందుబాటులో ఉంటే స్టేషన్ లోకి వెళ్తారు. లేదా మరొకటి బుక్ చేసుకుంటారు.

ఇప్పటి వరకు ఎయిర్ పోర్టు తరహాలో భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వేస్టేషన్ ఆధునిక సౌకర్యాలతో కొనసాగించాలని నిర్ణయించారు. ఇక్కడ బ్యాగ్ చెకింగ్ మిషన్ ను కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇది అందుబాటులోకి రాలేదు. అయితే సికింద్రా బాద్ రైల్వేస్టేషన్ లో అలాంటి జాప్యం కాకుండా చూసుకోవాలని రైల్వే అధికారులు సిద్ధమవుతున్నారు. సికింద్రాబాద్ లో సక్సస్ అయిన తరువాత మిగతా స్టేషన్లలోనూ ఈ విధానం అమలు చేసే అవకాశం ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News