Wednesday, February 5, 2025

ప్రభాస్ తో నటించడంపై శ్రద్ధా కపూర్ ఫన్నీ కామెంట్..

బాహుబలి తరువాత ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇప్పుడు రెబల్ స్టార్ అత్యంత ఖరీదైన హీరో అని కూడా చెప్పవచ్చు. ఆయన నటించిన లేటేస్ట్ మూవీ ‘కల్కి 2898AD’ జూన్ 27న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ కోసం రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వినిపిస్తోంది. దీంతో ఈ మూవీ కోసం ఇప్పటికే ‘బుజ్జి’ కారును రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో హోప్ పెంచారు. ఈ తరుణంలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ప్రభాస్ పై చేసిన కామెంట్ ఆసక్తిని కలిగిస్తోంది. ఇంతకీ ఆమె ఏమి చెప్పిందంటే?

శ్రద్ధా కపూర్.. ప్రభాస్ తో కలిసి ఇప్పటికే ‘సాహో’ అనే సినిమాలో నటించింది. ఆ సమయంలో తెలుగులో ఆకట్టుకోకపోయినా బాలీవుడ్ లో ఈ మూవీకి మంచి వసూళ్లుదక్కాయి. దీంతో శ్రద్ధా కపూర్ కు తెలుగులో ఫ్యాన్స్ పెరిగిపోయారు. ముఖ్యంగా సాహో సినిమా తరువాత శ్రద్ధ కపూర్ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు. ఈ సందర్భంగా ఓనెటిజన్ శ్రద్ధా కపూర్ ను ఓ ప్రశ్న అడిగాడు.

‘ప్రభాస్ తో మళ్లీ ఎప్పుడు నటిస్తారు?’ అని అడగగా.. ఈ ప్రశ్నకు శ్రద్ధ కపూర్ వెంటనే రిప్లయి ఇచ్చారు. ‘ప్రభాస్ ఇంటి నుంచి ఫుడ్ ఎప్పుడు వస్తుందో.. అప్పుడు ’ అని రిప్లై ఇచ్చింది. ఈ సమాధానంపై సినీ వర్గాల్లో ఆసక్తి చర్చ సాగుతోంది. అయితే సాహో సినిమాలో ప్రభాస్ తో నటించడం తన జీవితంలో మరిచిపోలేని విషయం అని శ్రద్ధా కపూర్ పరోక్షంగా సమాధానం ఇచ్చింది. దీనిన ప్రభాస్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News