Sunday, February 2, 2025

రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోబోయేది ఈమేనట.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం..

కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా అమ్మాయి ఈమెనంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలతో ప్రచారం సాగుతోంది. పొలిటికల్ లీడర్ గా తనకంటూ ప్రత్యేకత చాటుకున్న రాహుల్ గాంధీ పెళ్లిపై కొన్నాళ్లుగా జోరుగా చర్చ సాగుతోంది. అంతేకాకుండా తన పెళ్లి ఎప్పుడు ? అని రాహుల్ గాంధీని చాలా మంది చాలా సార్లు అడగగా.. సమాధానం చెప్పలేదు. కానీతాజాగా రాహుల్ గాంధీ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని, ఆ అమ్మాయి ఈమెనంటూ ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే?

దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న రాహుల్ గాంధీ గురించి నిత్యం ప్రత్యేకంగా చర్చ సాగుతూ ఉంటుంది. అయితే తాజాగా మహారాష్ట్ర లోని షోలాపూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ ప్రణతి షిండేను.. రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈమె ఎవరో కాదు. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే కూతురు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన ప్రణతి షిండే గతంలో జరిగిన ఓ ర్యాలీలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు కలిసి ఉన్న ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన ప్రణతి షిండే.. ఆ తరువాత రాహుల్ గాంధీని ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించారు. దీంతో రాహుల్, ప్రణతి మధ్య బంధం కలిసే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. అయితే రాయబరేలీలోనూ జరిగిన ర్యాలీలో ప్రణతిని ఈ పెళ్లి ప్రస్తావన గురించి అడగగా కొట్టి పారేయలేదట. దీంతో వీరిద్దరు కలిసి ఒక్కటయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై రాహుల్ గాంధీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News