పెటర్లో మునగ చెట్టు కనిపిస్తే పెద్దగా పట్టించుకోరు.. మార్కెట్లో మునగకాయలు దర్శనమిస్తే కొనడానికి ఇష్టపడరు… అంతేకాకుండా ఈ మునగ ఆకు, కాయల్లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయని చెప్పినా.. కొందరు వినరు. కానీ ఓ మహిళ మునగపై పరిశోధన చేయడానికి లక్షల రూపాయలు వచ్చే ఉద్యోగాన్ని వదులుకుంది. దీనిపై పరిశోధన చేసి అందులోని పోషకాల విలువ తెలిసిన తరువాత తాను మునగ తోటను పెంచుతోంది. అంతేకాకుండా రైతులతో ఆ పంటను వేయించి అధిక దిగుబడిని అందించేలా కృషి చేస్తోంది. ఇంతకీ ఆమె ఎవరు? అసలు మునగలో ఎలాంటి పోషకాలు ఉన్నాయి?
ఉత్తరప్రదేశ్ కు చెందిన కామిని సింగ్ పీహెచ్ డీ డాక్టర్. ఈమె సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ వంటి ప్రఖ్యాత సంస్థలతో కలిసి పనిచేశారు. అయితే తనకున్న అనుభవంతో మునగ చెట్టు పై పరిశోధనలు చేయాలని అనుకుంది. ఇందులో భాగంగా 2017 సంవత్సరంలో 10 మంది రైతులతో కలిసి మునగతోటను ఏర్పాటు చేసింది. అయితే చాలా మంది రైతులు వీటి ద్వారా తక్కువ దిగుబడి వస్తుందని తెలిసి నిరాసక్త చేశారు. కానీ తమ పంటపొలాల సరిహద్దుల్లో ఈ చెట్లను నాటించింది. అలా 100 చెట్లను నాటించారు. ఇవి ఏడాదికి 1500 కాయల దిగుబడి వచ్చింది. దీంతో వీటిని నాటిన ప్రతీ రైతుకు రూ.37,500 ఆదాయం వచ్చింది. దీంతో కేవలం పొలాల్లోనే కాకుండా ఇతర పంటలకు అనుసంధానంగా వీటిని ఏర్పాటు చేయించారు. అలా రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ విధంగా కేవలం మునగ చెట్ల ద్వారానే కామిని సింగ్ 2024లో రూ.1.70 కోట్ల ఆదాయాన్ని ఆర్జించారు.
మునగ ఆకు, కాయలు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి తినడం వల్ల బోలెడు కాల్షియం శరీరానికి చేరుతుంది. కాల్షియం అరటిపండులోనే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో విటమిన్ ఏ బిలు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, ఓమెగా 3 ఫ్యాటీ సమృద్ధిగా ఉంటుంది. మునగ ఆకు లేదా కాయలు తినడం వల్ల స్కిన్ ఇన్ ఫెక్షన్, అస్తమా, తలనొప్ప, గుండె సమస్యల నుంచి బయటపడవచ్చు. కాళ్ల నొప్పులు ఉన్న వారు సైతం మునగకాయల కూర తినడం వల్ల ఎంతో మేలు. అలాగే మునగ ఆకు రసం తాగడం వల్ల అదనపు ఎనర్జీ శరీరానికి చేరుతుంది.





