Tuesday, February 4, 2025

‘డాడీ’లో మెగాస్టార్ చిరంజీవికి కూతురుగా నటించిన ఈమె ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి..

మెగాస్టార్ చిరంజీవి మొదటిసారిగా తండ్రిగా నటించిన సినిమా ‘డాడీ’. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హీరోగా రాణిస్తున్న చిరు ఆ సినిమా మొత్తం ఓ పాప చుట్టూ తిరుతుండడంతో చిరంజీవి ఈ కథకు వెంటనే ఓకే చెప్పి నటించాడట. పూర్తిగా ఎమోషన్లో సాగే ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా చిరంజీవి పండించిన సెంటిమెంట్ తో కన్నీళ్లు తెప్పించాడు. చిరంజీవి స్థాయిలో అక్షయ అనే పాత్రలో నటించిన చిన్నారి కూడా తెలుగు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. డాడీ సినిమా వచ్చి దాదాపు 20 ఏళ్లు అవుతోంది. దీంతో ఈ సినిమాలో నటించిన చిన్నారి ఇప్పుడు హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఆ సమయంలో తన నటనతో ఆకట్టుకున్న ఆమె తాజా ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

డాడీ సినిమాలో అక్షయ, ఐశ్వర్య పాత్రలో నటించిన అమ్మాయి పేరు అనుష్ఖ మల్హోత్ర. ఈమె తెలుగు అమ్మాయి కాకపోయిన చిన్ని చిన్ని అడుగులు వేస్తూ అల్లరి చేసింది. అనుష్క లెటెస్ట్ ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి. అప్పట్లో డాడీ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు ఆమె ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఇక మెగా అభిమానులు మాత్రం అనుష్క అప్పటి, ఇప్పటి ఫొటోలను పెట్టి పోస్టు చేస్తున్నారు.

సురేశ్ క్రిష్ణ దర్శకత్వంలో వచ్చిన డాడీ సినిమాలో చిరంజీవి కూతరుగా నటించింది అనుష్క. వీరిద్దరు నిజమైన తండ్రీ కూతుళ్లలాగే నటించారు. అయితే అప్పుడు నటించిన అనుష్క మళ్లీ సినిమాల్లో నటించలేదట. తనకు సినిమా కంటే ఎక్కువ ఇతర విషయాలపై ఆసక్తి ఉండడంతో మళ్లీ ఈ రంగం వైపు చూడలేదంటున్నారు. కానీ ఆమె ఫొటోలు మాత్రం బయటకు వచ్చి హల్ చల్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు బాల నటులుగా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక హీరోయిన్ గా రాణించిన వారు ఎందరో ఉన్నారు. కానీ అనుష్క మాత్రం అస్సలు సినిమా జోలి ఎత్తడం లేదట. హీరోయిన్ స్థాయిలో తన అందచందాలతో ఆకట్టుకుంటున్న సినిమా అవకాశాల కోసం ఏమాత్రం ట్రై చేయడం లేదట. మరి అనుష్క మల్హోత్ర సినిమాలకు ఎందుకు రావడం లేదో తరువాతనైనా తెలుస్తుందా..?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News