కరీంనగర్: వచ్చే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కురుమలకు ప్రాధాన్యత ఇవ్వాలని కరీంనగర్ జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు కడారి అయిలన్న కురుమ, కురుమ సంఘం ట్రస్ట్ అధ్యక్షుడు చిగుర్ల శ్రీనివాస్ కురుమ రాజకీయ పార్టీలను కోరారు. శనివారం కలెక్టరేట్ సమీపంలో గల కురుమ సంఘం కార్యాలయంలో మీడియా మిత్రులతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్ చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో అన్ని రాజకీయ పార్టీలలో గల కురుమలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గత స్థానిక సర్పంచ్ ఎన్నికలలో కురుమలు ధైర్యంగా ముందుకు వచ్చి పోటీ చేసిన వారిలో చాలా మంది ఇతర వర్గాల ఆశీస్సులతో గెలుపొందారన్నారు. నీతికి నిజాయితీకి మారు పేరుగా ఉన్న కురుమలకు టికెట్ కేటాయిస్తే తప్పకుండా విజయం సాధించి పరిపాలనలో కూడా నిజాయితీగా సేవా చేస్తారన్నారు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు రాబోయే మున్సిపాల్ ఎన్నికలలో కురుమలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో కురుమలు గెలిచే స్థానాలలో సీట్లు కేటాయించి తగు ప్రాధాన్యత ఇచ్చి సీట్లు కేటాయించాలన్నారు.





