తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రధాన పండుగలు దసరా, సంక్రాంతి. తెలుగువారు ఎక్కడ ఉన్నా ఈ పండుగలో తమ సొంత ఊర్లకు ప్రయాణం చేస్తుంటారు. ఈ క్రమంలో దూర ప్రయాణాలు చేసేవారు ముందుగానే రిజర్వేషన్లు చేయించుకుంటారు. పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున.. దక్షిణ మధ్య రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతూ ఉంటుంది. ఈసారి సంక్రాంతికి కూడా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సదుపాయం జనవరి 7 నుంచి 20వ తేదీకి వరకు ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మార్గంలో నడిచే రైళ్ల వివరాలు ఏమో ఇప్పుడు చూద్దాం..
సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో మొత్తం 11 అదనపు ఎక్స్ప్రెస్ రైళ్లకు చర్లపల్లి లో ప్రత్యేక హాల్టు లను ఏర్పాటు చేసింది. హైదరాబాదు లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లే రైళ్లు మచిలీపట్నం -బీదర్ ఎక్స్ప్రెస్, నర్సాపూర్-లింగంపల్లి ఎక్స్ప్రెస్, లింగంపల్లి-విశాఖపట్నం, జన్మభూమి ఎక్స్ప్రెస్ ఉన్నాయి. అలాగే ఇదే రైల్వే స్టేషన్ నుంచి కాకినాడ టౌన్ -లింగంపల్లి గౌతమి, సాయి నగర్-మచిలీపట్నం ఎక్స్ప్రెస్, సాయి నగర్ -కాకినాడ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం -ముంబై ఎన్జీటీ ఎక్స్ప్రెస్, మచిలీపట్నం -సాయి నగర్, కాకినాడ -సాయి నగర్ షిరిడి ఎక్స్ప్రెస్, లింగంపల్లి-కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ ఉన్నాయి.
చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద నుంచి సికింద్రాబాద్-గూడూర్, సికింద్రాబాద్-సింహపురి, కాకినాడ-లింగంపల్లి-కాకినాడ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ గరీబ్ రథ్, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ, హైదరాబాద్-విశాఖపట్నం గోదావరి, తిరుపతి-సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్ప్రెస్ రైళ్లు చర్లపల్లి రైల్వే స్టేషన్ లో ఆగనున్నాయి.





