ఒక వస్తువును కనిపెట్టిన వారి గురించి చర్చించుకుంటాం.. ఒక సినిమాలో నటించే హీరో గురించి మాట్లాడుకుంటూ ఉంటాం.. డబ్బు ఎక్కువగా సంపాదించిన వారి గురించి చెప్పుకుంటూ ఉంటాం.. కానీ వీరు చాలా తక్కువ మందే ఉంటారు. ఒక్కోసారి వీరు లేకపోయినా కొందరి జీవితం సాగిపోతుంది. కానీ కొంతమంది వారు తమ విధులను నిర్వర్తించకపోతే అసలు జీవితమే ముందుకు సాగదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీరు మనకు ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటారు. కానీ వారి సేవలను గుర్తించం. పైగా ఒక్కోసారి అవమానిస్తూ కూడా ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే నిజమైన హీరోలు వాళ్లే అని చెప్పుకోవాలి. ఇంతకీ ఆ హీరోలు ఎవరంటే?
పారిశుద్ధ్య కార్మికులు:
మన శరీరంలో ఏదైనా మలినం ఏర్పడితే వెంటనే తీసేయాలని వైద్యుల దగ్గరికి వెళుతూ ఉంటాం. లేదా సొంత వైద్యం తోనే శరీరంలో ఉన్న మలినాన్ని తీసేసి శుభ్రంగా ఉండగలుగుతాం. అలాంటిది మన చుట్టూ వాతావరణం కలుషితంగా మారితే శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే సమాజం ఎలా ఉండేదో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో వీరి సేవలు లేకపోతే ఎక్కడ చెత్త అక్కడే ఉండి.. వాతావరణం కలుషితంగా మారి జీవన వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవుతుంది. అందువల్ల నిజమైన హీరోల్లో వీరు ఒకరు.
పాలవారు:
ఉదయం లేవగానే టీ లేదా కాఫీ లేకపోతే చాలామందికి రోజు ప్రారంభం కాదు. స్కూలుకు వెళ్లే పిల్లవారు సైతం పాలు లేదా టీ తాగకుండా ఉండలేరు. ఉదయం టీ తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల రోజంతా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఎంతో కష్టపడి పాలను తీసుకువచ్చే వీరిని చాలామంది చిన్న చూపు చూస్తుంటారు. వారు చేసే పని చిన్నది అనిపిస్తుంది. కానీ వారు లేకపోతే జీవితమే కష్టంగా మారుతుంది.
సెక్యూరిటీ గార్డ్:
ఎంతో కష్టపడి కంపెనీలు నిర్మించుకుంటారు. అత్యధికంగా డబ్బు సంపాదిస్తారు. కానీ వాటిని కాపాడుకోవడంలో నేడు కష్టతరంగా మారుతుంది. ఇలాంటి సమయంలో సెక్యూరిటీ గార్డుల సహాయం ఎంతో అవసరంగా మారింది. కంపెనీలు, సంస్థలు, అపార్ట్మెంట్లలో సెక్యూరిటీ గార్డులు ఉండడం వల్ల ఎంతో భద్రతతో ఉండగలుగుతున్నారు. కొంతమంది వీరి చిన్నదే అనిపిస్తుంది. కానీ వీరు లేకపోతే కూడా జీవనం కష్టంగా మారుతుంది.
ఇలా వీరు మాత్రమే కాకుండా రోజు ఇంట్లోకి వచ్చి పని చేసేవారు.. దుస్తులు శుభ్రం చేసేవారు.. ఇలా ఎంతోమంది సహాయకులుగా ఉండేవారిని చిన్న పని అని భావిస్తూ ఉంటారు. ఒక్కోసారి వారు లేకపోతే రోజు ఎలా గడుస్తుంది అన్న భయం వేస్తుంది. అందువల్ల వీరి అవసరం తప్పకుండా ఉంటుంది. ఎప్పటికీ వీరిని గుర్తించాలని కొందరు కోరుతున్నారు. పనిలో మంచిపని, చెడ్డ పని ఉంటుంది. కానీ చిన్న పని పెద్ద పని అనేది ఉండదు. అందువల్ల సమాజానికి ప్రతి ఒక్కరి సేవా కచ్చితంగా అవసరమే. వారు చేసే పని కూడా మిగతా వారితో సమానమే.





