ఒకసారి అవినీతి జరిగితే అతడిని Anti Corruption Bureau(ACB) పట్టుకుంటుంది. రెండోసారి ఇలాగే చేసిన ఏసీబీ పట్టుకొని జరిమానా లేదా జైలు శిక్ష వేస్తుంది. కానీ ఓ అధికారి రెండుసార్లు పట్టుబడినా.. మూడోసారి కూడా లంచం తీసుకునేందుకు రెడీ అయ్యాడు. అయితే మూడోసారి ఏకంగా రూ. ఐదు కోట్ల లంచానికి పెసర పెట్టాడు. తాజాగా దొరికిన ఈ తిమింగలం గురించి తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా చర్చ జరుగుతుంది. అసలు వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్లోని ఏపీ గిరిజన సంక్షేమ శాఖ ఈఎంసి సబ్బవరపు శ్రీనివాస్ తన ఛాంబర్ లో రూ. 25 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో గిరిజన ప్రాంతాల్లో నిర్మించే ఏకలవ్య పాఠశాలల భవనాల కాంట్రాక్టును ఇప్పించేందుకు ఆయన ఈ పని చేశాడు. ఈ కాంట్రాక్టును శ్రీ సత్య సాయి కన్స్ట్రక్షన్ అధినేత కృష్ణంరాజు దక్కించుకున్నారు. ఆయన గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలను నిర్మించారు. అయితే ముందుగా ఈ పాఠశాల ఒక్కో భవనం రూ. 12 కోట్ల అంచనా వేయగా.. పూర్తయ్యేసరికి రూపం 15 కోట్లకు చేరింది. దీంతో వీటికి సంబంధించిన రూ. 35.50 కోట్ల బిల్లులను విడుదల చేయాలని కోరారు. అయితే వీటికి సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా.. ఈఎంసి శ్రీనివాస్ మాత్రం వాటిని ఇవ్వడానికి ఏదో రకంగా కొర్రీలు పెడుతున్నట్లు బాధితుడు తెలిపాడు.
ఈ బిల్లులు రావాలంటే మొత్తం రూ. 5 కోట్ల లంచం ఇవ్వాలని అడిగాడు. అయితే ముందుగా రూ. 25 లక్షలు ఇవ్వాలని చెప్పడంతో.. కృష్ణంరాజు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. దీంతో ఏసీబీ అధికారులు శ్రీనివాస్ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే మరో మూడు వారాల్లో ఈయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ ఈ సమయంలో ఏసీబీ కి చిక్కడంతో ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో అని చర్చించుకుంటున్నారు.
అదీకాక 2001లో, 2014లో రెండుసార్లు ఆయన లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కాడు. మూడోసారి కూడా ఆయన లంచం కోసం డిమాండ్ చేయడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.





