Tuesday, June 24, 2025

గ్యాస్ సిలిండర్ పై QR కోడ్.. ఎందుకంటే?

ప్రస్తుతం కాలంలో మనీ చెల్లించాలన్నా, బిల్లులు కట్టాలన్నా క్యూఆర్ కోడ్ వినియోగిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా విద్యుత్ బిల్లులపై కూడా QR కోడ్ ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. అయితే తాజాగా వంట గ్యాస్ సిలిండర్లపై కూడా క్యూఆర్ కోడ్ ఉంచాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గ్యాస్ సరఫరాలో అవకతవకలను తగ్గించేందుకు, సిలిండర్ ట్రాక్ కోసం ఇది ఉపయోగపడుతుందని అన్నారు. సిలిండర్లపై క్యూ ఆర్ కోడ్ ముసాయిదాను గ్యాస్ సిలిండర్ రూల్స్ జీసీఆర్ లో పొందు పరిచినట్లు మంత్రి తెలిపారు. త్వరలో దీనిపై నోటిఫికేషన్ కూడా వెలువరిస్తామని అన్నారు.

వంట గ్యాస్ వినియోగదారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈ ఇబ్బందులను అధిగమించేందుకు క్యూ ఆర్ కోడ్ ను రూపొందించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.అలాగే నివాసాల నుంచి 30 నుంచి 50 మీటర్ల లోపు పెట్రోల్ పంపులు ఉండేలా, అవసరమైన భద్రతా చర్యల నమూనాను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందుకోసం పెట్రోలియం అండ్ ఎక్స్ ప్లోజివ్స్ సేప్టీ ఆర్గనైజేషన్ ను ఆదేశించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News