Friday, January 30, 2026

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించండి..

కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ కచ్చితంగా పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం చింతకుంట పరిధి శాంతినగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు తిరుగుతూ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మధ్యాహ్నం భోజనం, బోధన మెటీరియల్, రీడింగ్ కార్నర్ ను పరిశీలించారు. పాఠశాలలో టీవీ పని చేస్తుందా.. ఉపాధ్యాయులు ఏం చెబుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అదనపు తరగతి గదుల కోసం భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
వారి వెంట ఎంఈఓ ఆనందం, హెచ్ఎం గౌస్ ఖాన్ తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News