కన్నడ సోయగం రష్మిక మందానా టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా ఫుల్ సినిమాలతో బిజీగా మారింది.ఈ అమ్మడు డేట్స్ కావాలంటే ఇప్పుడు ఏడాది దాకా ఆగాల్సిందేనన్న చర్చ సాగుతోంది. 2016లో కన్నడ ‘కిరిక్ పార్టీ’ మూవీతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మను మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ రెండు సంవత్సరాల తరువాత 2018లో తెలుగలో ‘చలో’ మూవీతో అందరికీ పరిచయం అయింది. ఆ తరువాత ‘గీతా గోవిందం’ సినిమాతో ఫేమస్ అయింది.
ఈ మూవీ బంఫర్ హిట్టు కావడంతో రష్మికకు అవకాశాలు వరదలా పారాయి. ఆ తరువాత ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాల్లో నటిస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మడుకు తీరిక లేదంటే ఎవరూ నమ్మరు. తెలుగుతో పాటు హిందీలోనూ పలు అవకాశాలు తెచ్చుకున్న రష్మిక కు ‘యానిమల్’ మంచి గుర్తింపు ఇచ్చింది. దీంతో ఆమెకు ఇప్పుడు చేతిలో పలు సినిమాలతో బిజీగా మారింది.
ప్రస్తుతం రష్మిక తెలుగులో ‘పుష్పా 2’తో బిజీగా ఉంది. దీంతో పాటు రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్, కుబేర చిత్రాలు చేతిలో ఉన్నాయి. వీటితో పాటు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కి జోడిగా ‘సికిందర్’ లో నటిస్తోంది. విక్కీ కౌశల్ తో ‘చావా’ సినిమాలో కనిపించనుంది. అయితే హిందీలో మరికొన్ని ఆఫర్లు వచ్చినా డేట్స్ లేని కారణంగా రిజక్ట్ చేస్తుందట. మొత్తంగా చూస్తే మరో ఏడాది పాటు రష్మిక డేట్స్ దొరకడం కష్టమేనని తెలుస్తోంది.