యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా.. కంపెనీలను ప్రోత్సహించాలన్నా ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త పథకం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పథకంపై గతంలోనే నిర్ణయం తీసుకోగా.. 2025 ఆగస్టు 1 నుంచి ప్రారంభించనున్నారు. యువత అభివృద్ధే లక్ష్యంగా చేసుకొని తీసుకొస్తే దీనికి ‘వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన (Prime Minister Vikasit Bharat Rojgar Yojana)’ అని పేరు పెట్టారు. మరి ఈ పథకం ఉద్దేశం ఏంటీ? ఎవరికీ ఇది ఉపయోగంగా ఉంటుందో చూద్దాం..
ఆగస్టు 1 నుంచి కేంద్ర ప్రభుత్వ పథకం అందుబాటులోకి రానుంది. అదే ‘వికసిత్ భారత్ రోజ్ గారి యోజన’. స్థిరమైన ఉపాధిని కల్పించాలని దీనిని తీసుకొస్తున్నారు. యువత కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు.. కొత్తగా EPF ఖాతాలను ప్రారంభించిన వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా రూ. 15,000 చొప్పున వారి ఖాతాల్లో జమచేయనున్నారు. ఈ మొత్తాన్ని రెండు విడతలుగా ఇవ్వనున్నారు. కొత్తగా ఉద్యోగులను నియమించుకున్న కంపెనీలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్ అందించనుంది. వీటికి ఒక్కో ఉద్యోగిపై రూ.3,000 రానున్నాయి. అయితే ఈ పథకం వర్తించాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. ఒక ఉద్యోగి ఆరు నెలల సర్వీసు అయి ఉండాలి. ఆ ఉద్యోగికి రూ.లక్ష లోపు జీతం ఉండాలి. వీరికి ఇచ్చే మొత్తాన్ని ఈపీఎఫ్ అకౌంట్ లో జమ చేస్తారు. ఇది ఫిక్స్ డ్ డిపాజిట్ రూపంలో ఉంటుంది. దీనిని ఉద్యోగి అసవరం అనుకుంటే విత్ డ్రా చేసుకోవచ్చు.
2025 ఆగస్టున ప్రారంభమైన ఈ పథకం 2027 జూలై 31 వరకు కొనసాగుతుంది. ఇందు కోసం ఇప్పటి కే ప్రభుత్వం రూ. 99,446 కోట్లను మంజూరు చేసింది. వచ్చే రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం 1.92 కోట్ల ఉద్యోగులు ఈ పథకం ప్రయోజనం పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.





