ప్రభాస్ నటిస్తున్న లెటేస్ట్ మూవీ ‘కల్కి 2989 AD’ మూవీ భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీ ట్రైలర్ మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. ఇంతకంటే ముందే మూవీ ఫ్యాన్స్ ను ఆకట్టుకునే విధంగా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో బిగ్ బీ అమితామ్ కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ‘కల్కి 2989 AD’ లో అమితాబ్ అశ్వత్థామ పాత్రను పోషిస్టున్నాడు. యుద్ధభూమిలో నిల్చున్న అశ్శత్థామగా ఈ పోస్టర్ లో అమితాబ్ కనిపిస్తున్నాడు. మధ్యప్రదేశ్ లోని నెమావార్, నర్మదా ఘాట్ వద్ద ఈ షూటింగ్ ను జరిపినట్లు తెలుస్తోంది. పురాణాల ప్రకారం అశ్వత్థామ నర్మదా నది పరిసరాల్లో సంచరిస్తాడు.
‘కల్కి 2989 AD’ లో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమలహాసన్, నటిస్తున్నారు. హీరోయిన్లుగా దీపికా పదుకునే, దిశా పటానీ అలరించనున్నారు. ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని జూన్ 27న రిలీజ్ చేయనున్నారు. కాగా జూన్ 10న ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆవురావురు మంటూ వెయిట్ చేస్తున్నారు.