కార్మిక చట్టాల అమలుపై కేంద్ర ప్రభుత్వం కీలకం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సంక్షేమ కోసం 29 పాత కార్మీక చట్టాలను ఏకీకృతం చేసి కొత్త లేబర్ కోడ్ ను రూపొందించింది. దీనిని శుక్రవారం నుంచి అమలులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త కోడ్ లో వేతన కోడ్ (Wage Code),సామాజిక భద్రతా కోడ్ (Social Security Code),పారిశ్రామిక సంబంధాల కోడ్ (Industrial Relations Code),వృత్తి భద్రత & ఆరోగ్య కోడ్ (OSH Code) కలిపి ఉంటాయి. ఇవి వ్యవస్థీకృత, అసంఘటిత కార్మికులకు రక్షణ కవచంగా పనిచేస్తాయి. అయితే ఈ చట్టాల వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం..
భారత ప్రభుత్వం తీసుకువచ్చిన Labour Code దేశంలోని లక్షలాది ఉద్యోగుల పని విధానాన్ని పూర్తిగా మార్చే కీలక సంస్కరణగా నిలుస్తోంది. ఇప్పటి వరకు 40కి పైగా ఉన్న కార్మిక చట్టాలను కలిపి 4 కొత్త కోడ్ లుగా మార్చింది. వీటితో ఉద్యోగుల దైనందిన జీవితం, వారి హక్కులు, భద్రతా ప్రయోజనాలు బాగా మెరుగుపడతాయి.
వేతన నిర్మాణంలో పెద్ద మార్పు: కొత్త Wage Code ప్రకారం Basic Salary కనీసం 50% కంటే తక్కువ ఉండకూడదు. వీరికి కచ్చితంగా అపాయంట్ మెంట్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగి PF, గ్రాట్యుటీ పెరుగుతాయి. దీర్ఘకాలికంగా రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ మొత్తం లభిస్తుంది. అయితే Take-Home కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఉద్యోగికి దీర్ఘకాల ప్రయోజనం ఎక్కువ.
కొత్త Social Security Code ప్రకారం.. కాంట్రాక్ట్ ఉద్యోగులు, గిగ్ ఉద్యోగులు (Zomato, Swiggy, Ola సంస్థల్లో పనిచేసేవారు), Fixed-term employees అందరూ గ్రాట్యుటీకి అర్హులు అవుతారు. అంతకుము 5 ఏళ్ల సర్వీస్ తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు ఆ షరతు లేకపోవడం ఉద్యోగులకు పెద్ద లాభం.
పని గంటలు మారబోతున్నాయి: రోజుకు 12 గంటలు ఆప్షన్ గా ఉంటుంది. అయితే వారానికి మొత్తం పని గంటలు 48 గంటలు మాత్రమే. అంటే ఉద్యోగికి 3 రోజుల లాంగ్ వీక్‌ఎండ్ కల్పించేందుకు కంపెనీలు 4-Day Work Week కూడా అమలు చేయవచ్చు.
సంవత్సరానికి కనీసం 18 Earned Leaves తప్పనిసరి. లీవ్ క్యారీ ఫార్వర్డ్, encashment అవకాశాలు సులభం. ప్రయాణం ఎక్కువగా చేసే కార్మికులకు ఇది పెద్ద ఊరట.
మహిళలు రాత్రి పూట కూడా పని చేయొచ్చు. అయితే కంపెనీ భద్రతా ఏర్పాట్లు చేయాలి. మాతృత్వ సెలవులు (Maternity Leave) పెరిగే అవకాశం. కార్యాలయంలో మహిళలపై హరాస్‌మెంట్ ఉంటే కఠిన చర్యలు తీసుకునే అవకాశం.
గిగ్ , ప్లాట్‌ఫామ్ ఉద్యోగులకు పింఛన్ స్కీమ్, ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత వంటి ప్రయోజనాలు రావడం పెద్ద సంస్కరణగా పరిగణించబడుతోంది.
PF – గ్రాట్యుటీ పెరగడం
రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ సొమ్ము
లీవ్ ప్రయోజనాలు మెరుగుపడటం
మహిళల భద్రత పెరగడం
గిగ్ ఉద్యోగులకు ప్రభుత్వ రక్షణ
కంపెనీల యథేచ్ఛ నిర్ణయాలకు నియంత్రణ
మొత్తంగా చూస్తే కొత్త Labour Code ఉద్యోగులకు దీర్ఘకాలికంగా భారీ ప్రయోజనం కలిగించే సంస్కరణ.





