Saturday, December 6, 2025

జాతీయ ఉత్తమ చిత్రం ‘అట్టం’.. ఈ సినిమాకు అవార్డు ఎందుకు వచ్చిందంటే?

జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో జాతీయ ఉత్తమ చిత్రంగా మలయాళం సినిమా ‘అట్టం’ ఎంపికైంంది. ఉత్తమ నటుడిగా కాంతార మూవీ లోని హీరో రిషబ్ షెట్టి ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా నిత్య మీనన్ తిరుచిట్రంళం చిత్రంలోని నటనకు ఎంపికయ్యారు. తెలుగు చిత్రం కార్తీకేయ 2 ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికరైంది. అయితే ఇప్పుడంతా జాతీయ ఉత్తమ చిత్రం అట్టం గురించి సినీ ఇండస్ట్రీ ఆసక్తిగా చర్చించుకుంటోంది. ఇంతకీ ఈ సినిమాలో ఏముంది? ఎందుకు ఈ అవార్డుకు ఎంపికైంది?

మళయాళం సినిమాలు ప్రయోగాత్మకాన్ని తలపిస్తాయి. ఇక్కడ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు సినిమాను సినిమాలాగా కాకుండా ఒక పరిశోధనగా చిత్రీకరిస్తుంటారు. ఇప్పటికే మలయాళం నుంచి ఎన్నో సినిమాలు జాతీయ పురస్కారాలకు ఎంపికయ్యాయి. తాజాగా ఎంపికైన అట్టం మూవీ కూడా ఒక ప్రయోగమే అని చెప్పవచ్చు. ఈ మూవీ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఓ మెసేజ్ ను కూడా అందించారు. ఇందులో ఈ సినిమాలో సాధారణ సినిమాలో లాగే 12 మంది నటులు ఉన్నారు. కానీ ఒకే ఒక్క హీరోయిన్ ఉంటారు. ఆమె జరీన్ షిబాబ్. ఇక 12 మంది నటుల్లో వినయ్ పోర్ట్, కళాభవన్ షాజాన్ లు కీలకంగా ఉంటారు.

12 మంది అంతా వివిధ పనుల్లో నిమగ్నమైపోతుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో కలిసి నాటకం ప్రదర్శిస్తారు. ఒకరోజు వీరు వేసిన నాటకాన్ని మెచ్చిన విదేశీ జంట తమ రిసార్ట్ లోకి ఆహ్వానిస్తుంది. అక్కడికి వెళ్లిన వీరు మద్యం పార్టీలో మునిగి తేలుతారు. ఆ తరువాత హీరోయిన్ అంజలి (జరీన్ షిబాబ్) ఒక రూంలో నిద్రపోతుంటుంది. ఈ సమయంలో ఆమెతో ఎవరో అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఆ వ్యక్తి ఎవరనేది తెలుసుకోవమే కథాంశం.

అయితే కాన్సెప్ట్ పాతదే అయినా ఈ సినిమాను చిత్రీకరించడంలో డైరెక్టర్ కొత్తదనాన్ని చూపించాడు. మనుషులకు ఎలాంటి వ్యక్తిత్వాలు ఉంటాయి? వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు? అనేది ఇందులో చక్కగా చూపించారు. ఇక హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి తెలిసిన తరువాత అలసు కథ ప్రారంభం అవుతుంది. ఇందులో ఒక్కరినే బాధ్యుడిని చేసి మిగతా వారు నటించే విదానం కొత్తగా కనిపిస్తుంది. మొత్తంగా చిన్న కాన్సెప్ట్ అయినా సినిమా ఆకట్టుకుంటుంది. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో వీక్షించవచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News