నడక ఆరోగ్యానికి మంచిది అని వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం కాలంలో చాాల మంది శారీరక శ్రమ చేయడం లేదు. దీంతో అనేక కొత్త రోగాలు వస్తున్నాయి. పూర్వ కాలంలో శారీరక శ్రమ చేయడం వల్ల కొన్ని వ్యాధులకు దూరంగా ఉన్నారు. అందువల్ల ప్రతిరోజూ తప్పకుడా కనీసం 100 అడుగులు వేయాలని అంటున్నారు. నడక వల్ల శరీరంలోని కొవ్వు కరిగే అవకాశం ఉంది. గుండె సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ప్రకృతిలో నడవడం వల్ల శ్వాస సమస్యలు తొలగిపోతాయి. అయితే ఉదయం నడవం మంచిదా? లేదా సాయంత్రం వాకింగ్ చేయడం మంచిదా? అని చాలా మందికి సందేహం ఉంది. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే?
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది నేటి కాలంలో వాకింగ్ చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు పట్టణాల్లోని మైదానాలు వాకర్స్ తో నిండిపోతున్నాయి. యువకులు సైతం వాకింగ్ చేయడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే చాలా మంది ఉదయం లేచి గ్రౌండ్ కు వెళ్లి వాకింగ్ చేయడం కుదరదు. పొద్దున్నే కొన్ని పనుల నిమిత్తం మార్కింగ్ వాకింగ్ కు దూరంగా ఉంటున్నారు. దీంతో సాయంత్రం వాకింగ్ చేస్తున్నారు. కొందరు సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? అని ప్రశ్నలు తలెత్తుతున్నారు.
ఉదయం, సాయంత్రం రెండు సమయాల్లో వాకింగ్ చేయడం మంచిదేనని ఆరోగ్యి నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం వాకింగ్ చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. సిర్కాడియన్ రితమ్ సానుకూలంగా పనిచేస్తుంది. ఉదయం నడవడం వల్ల టైమ్ సెన్స్ పెరుగుతుంది. ఏ పని అయినా గడువులోపే పూర్తి చేయగలుగుతారు. ఉదయం చల్లని వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో వాకింగ్ చేయడం వల్ల మనసు ఉల్లాసంగా మారుతుంది. శరీరానికి కావాల్సినంత ఉష్ణోగ్రత అందుతుంది. దీంతో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. ఉదయం స్వచ్ఛమైన కాంతి ప్రసరిస్తుంది. దీంతో ఇది తలమై పడడం వల్ల అనేక విటమిన్లు లభిస్తాయి.
సాయంత్రం నడకలోనూ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. రోజంతా విధుల్లో బిజీగా ఉన్న వారు సాయంత్రం కాస్త సమయం తీసుకొని నడక ప్రారంభించాలని అంటున్నారు. సాయంత్రం నడవడం వల్ల ఒత్తిడి నుంచి దూరమవుతారు. దీంతో పోస్ట్ వర్క్ స్ట్రోల్ ను బిల్డప్ చేసుకుంటారు. కొందరు రిలాక్స్ కోసం వ్యసనాల బారిన పడుతారు. కానీ కాసేపు నడవడం వల్ల ఒత్తిడి నుంచి దూరమవుతారు. సాయంత్రం నడవడం వల్ల రాత్రి ఆహారం ఎక్కువగా తీసుకున్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. ప్రశాంతంగా నిద్ర పోతారు.
బరువు తగ్గడానికి ఏ సమయం అయినా నడక మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటారు. అయితే రోజంతా కాస్త శ్రమతో కూడుకొని చేసే పనివాళ్లు మాత్రం ఉదయం నడవడం వల్ల ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కోరు. ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల బరువు పెరుగుతారు. అందువల్ల ఉదయం నడవడం వల్ల రిలాక్స్ డ్ గా ఉంటారు. ఉదయం కాసేపు, సాయంత్రొ మరికొంత సేపు వాకింగ్ షెడ్యూల్ ను నియమించుకున్నా.. బరువు తగ్గే ప్రయోజనాలు ఉన్నాయి.