బంగాళాఖాతంలో ఏర్పడిన మంతా తుఫాన్ తెలంగాణపై కూడా ప్రభావం చూపింది. బుధవారం ఉదయం కాకినాడ వద్ద తీరం దాటడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబా నగర్ జిల్లాలో వర్షపాతం నమోదయ అవకాశం ఉందని తెలుపగా.. బుధవారం మధ్యాహ్నం వరకు వరంగల్, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది.
తాజా నివేదికల ప్రకారం మొంత్ తుఫాన్ భద్రాచలం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఖమ్మం నుండి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృ త తమై ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర వాయువ్య అధ్యక్షులు కదులుతూ రాబోయే ఆరు గంటల్లో ఇది అల్పపీడనం గా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ కారణంగా హనుమకొండ, వరంగల్, కరీంనగర్, అదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాలకు తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే సిద్దిపేట, సూర్యాపేట, భువనగిరి, భూపాలపల్లి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షంతో వరంగల్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి మహబూబాబాద్ లో కృష్ణ ఎక్స్ప్రెస్ ఆగిపోగా డోర్నకల్ స్టేషన్ నీట మునిగింది. దీంతో గోల్కొండ, షిరిడి, ఇంటర్సిటీ రైలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలో కూడా ఉండడంతో ప్రభుత్వం అప్రవతమైంది. దీంతో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా కరీంనగర్లోని మానేరు డ్యామ్ లోకి భారీగా నీరు రావడంతో రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తెలంగాణపై తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. రెవెన్యూ, విద్యుత్ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.





