బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. మాజీ సీఎం కేసీఆర్ ను గురువారం కలుసుకున్నారు. ఢిల్లీ జైలు నుంచి నిన్న ఆమె హైదరబాద్ వచ్చిన విషయం తెలిసిందే. గురువారం కేసీఆర్ ఫాం హౌస్ కు వెళ్లారు. అక్కడ ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ కవితకు సాదరంగా ఆహ్వనం పలికారు. ఆ తరువాత కూతరును ఆలింగనం చేసుకున్నారు. ఆనంతరం కేసీఆర్ కాళ్లకు కవిత నమస్కరించింది. ఈ సందర్భంగా కవిత కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కేసీఆర్ సైతం బావోద్వేగంతో కనిపించారు. కేసీఆర్ ను కవిత కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జైలు నుంచి విడుదలయిన కవితకు ఢిల్లీలో కుమారుడు, భర్త తో పాటు మాజీ మత్రులు కేటీఆర్, హరీష్ రావులు స్వాగతం పలికారు. ఆ తరువాత ఆగస్టు 28న కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక్కడ ఆమెకు ఎయిర్ పోర్టు నుంచి ఘన స్వాగతం పలికారు. అనంతరం తల్లిని కలుసుకున్న ఫొటోలు బయటకువ చ్చాయి. అయితే గురువారం ఆమె తన తండ్రి కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా కవితతో పాటు కేసీఆర్ కళ్లల్లో ఆప్యాయత కనిపించింది. ఈ సందర్భంగా ఎటువంటి చర్చలు ఉంటాయోనని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.