Friday, January 30, 2026

వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన..

రేపు హుస్నాబాద్ మీదుగా ముఖ్యమంత్రి ఏరియాలో సర్వే

వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది జాతీయ విపత్తు గా ప్రకటించి రాష్ట్రానికి కేంద్రం సహకరించాలి – మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్: మొంథా తుఫాన్ హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రళయం సృష్టించింది.. వేలాది ఎకరాల్లో పంట నష్టం చేసింది.భారీ వరదకు మార్కెట్ లలో ధాన్యం కొట్టుకుపోయింది. కిలోమీటర్ల మేర రోడ్డు ధ్వంసం అయింది. కల్వర్టులు పూర్తిగా కూలిపోయాయి. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రైతు కంట కన్నీరు కనిపిస్తుంది. ప్రతి చెరువు భీకరంగా అలుగులు పొంగుతున్నాయి. ఇక గ్రామానికి మరో గ్రామానికి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ హుటాహుటిన నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు.

అక్కన్నపేట మండలం మోత్కులపల్లె వాగు దాటుతుండగా బైక్ పై వెళ్తున్న ఇద్దరు భార్యాభర్తలు ప్రణయ్, కల్పన లు గల్లంతైన ప్రాంతాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.గల్లంతు అయి 24 గంటలు దాటిన ఇంత వరకు దొరకకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేసేలా చీఫ్ సెక్రెటరీ రామకృష్ణ తో మాట్లాడారు.జిల్లా కలెక్టర్ , పోలీస్ కమిషనర్ నిరంతరం అక్కడే ఉండి సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఫైర్ ఫైటర్స్ ,గజ ఈతగాళ్ల తో గాలించిన ప్రయోజనం లేకపోవడంతో ఈరాత్రి ఎస్డిఆరెఫ్ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయనీ పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో రేపు ఉదయం నుండి సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేసి గల్లంతు అయిన ఆచూకీ వేదికెల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు .గల్లంతు అయిన ప్రణయ్, కల్పనల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతుండటంతో మంత్రి పొన్నం ప్రభాకర్ వారిని ఓదార్చారు.ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.రైతులకు బాధితులకు తానున్నంటూ దైర్యం కల్పించారు.

బస్వాపూర్ పోరెడ్డిపల్లి లో వరద ఉధృతికి తెగిన రోడ్డు పరిశీలించారు. గత ఆరు దశాబ్దాలుగా ఇంతలా బీభత్సమైన వరద చూడలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్వాపూర్ అక్కెనపల్లి మధ్య మోయ తుమ్మెద వాగును పరిశీలించారు. తెగిన రోడ్లను ,కూలిన బ్రిడ్జి లు , కల్వర్టులను పునః నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

హుస్నాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం భారీ వరదకు కొట్టుకుపోవడంతో ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మహిళా రైతు వీరవ్వ కు చెందిన ధాన్యం పూర్తిగా వరదల్లో తుడుచుకుపెట్టుకుపోవడంతో కన్నీటి పర్యంతము అయ్యారు. మహిళా రైతు వీరవ్వ కు తక్షణ సహాయం కింద 10 వేల రూపాయలు అందించారు.ఇంకా మార్కెట్ లో ఉన్న తడిసిన ధాన్యాన్ని రైతులకు ఇబ్బందులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలంలో సీతారాంపూర్ చౌరస్తా వద్ద రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇందుర్తి లో లెవెల్ బ్రిడ్జి మునిగిపోవడంతో త్వరలోనే హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. సైదాపూర్ మండల కేంద్రంలో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది దానిని కొనుగోలు చేయాలని ఆదేశించారు.

భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి కల్వర్టు వద్ద అప్పని నాగేంద్రం వరద ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించారు. లో వారి నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు.గట్ల నర్సింగాపూర్ వద్ద తెగిన కల్వర్టు ను పరిశీలించారు.

రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విపత్తు తుఫాన్ ప్రభావం వల్ల వచ్చిందని హుస్నాబాద్ లో జరిగిన నష్టం ఊహించని విధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో విడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి హుస్నాబాద్ విపత్తు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రేపు హుస్నాబాద్, హనుమకొండ , వరంగల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయనున్నారు. మరోవైపు దీనిని జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా ఈ విపత్తు ను ఎదుర్కొని రైతులకు ప్రజలకు అండగా ఉందామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News