ప్రపంచంలో కొరియన్ల అమ్మాయిల అందం గురించి ఇటీవల చర్చ బాగా సాగుతోంది. ఇక్కడి వారు అద్దంలా మెరిసే చర్మంతో పాటు బక్కచిక్కిన నడుముతో ఎంతో స్లిమ్ గా ఉంటారు. ఇక్కడి వారు ఎన్ని పెద్ద వ్యాపారాలు చేసినా.. ఉద్యోగంలో ఎలాంటి బిజీ ఉన్నా.. ఆరోగ్యం, సౌందర్యం విషయంలో మాత్రం ప్రత్యేకంగా చొరవ తీసుకుంటారు. ముఖ్యంగా కొరియన్లు ఈ 10 టిప్స్ ను కచ్చితంగా ఫాలో అవుతారు. దీంతో వారి చర్మంలో మెరుపు కనిపిస్తుంది.
ఉదయం స్కిన్ కేర్ రిచ్యువల్:
కొరియన్లు ప్రతిరోజూ ఉదయం చర్మం కాంతివంతంగా ఉండేందుకు క్లీన్స్, టోన్లతో మాయిశ్చరైజ్ చేస్తుంటారు. ఇలా ప్రతిరోజూ తప్పకుండా చేయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది.
సూర్యరశ్మి:
కొరియన్లు సూర్యరశ్మి నుంచి రక్షణ పొందేందుకు స్కిన్ కేర్ తీసుకుంటారు. ఇందు కోసం సన్ స్క్రీన్ క్రిమును ఉపయోగిస్తారు. ఇది చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది.
పులియబెట్టిన ఆహారం:
కొరియన్ల వంటకాల్లో పులియబెట్టిన ఆహారం తప్పనిసరిగా ఉంటుంది. ఇవి జీర్ణాశయాన్ని పెంపొందిస్తాయి. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుతాయి. దీంతో యవ్వనంగా కనిపిస్తారుు.

పుష్కలంగా నీరు తాగడం:
కొరియన్లు ఆరోగ్య ప్రక్రియలో భాగంగా పుష్కలంగా నీరు తాగుతారు. నీరు తాగడం వల్ల డీ హైడ్రెట్ నుంచి తప్పించుకోవచ్చు.
కంటినిద్ర:
నిద్ర విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కారు కొరియన్లు. ప్రశాంతమైన నిద్ర ఉండేందుకు అవసరమైతే జాబ్ టైమింగ్స్ ను మార్చుకుంటారు.

రిలాక్స్ టెక్నిక్స్:
ఎన్ని పనులు ఉన్నా రిలాక్స్ కావడానికి కొరియన్లు ప్రత్యేక చొరవ తీసుకుంటారు. ఇందుకోసం ధ్యానం లేదా ప్రకృతిలో ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తారు.
కుటంబ సంబంధాలు:
మనసు ప్రశాంతంగా ఉండేందుకు కొరియన్లు ఎక్కువగా రిలేషన్ షిప్స్ మెయింటేన్ చేస్తారు. బంధువులతో కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నిస్తారు.

సాత్విక ఆహారం:
కొరియన్లు ఎక్కువగా సాత్విక ఆహారం తీసుకోవడానికి ఇష్టపడుతారు. ఇది త్వరగా జీర్ణమై ఎలాంటికొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.
సాంప్రదాయ వైద్యం:
ఆరోగ్యం కోసం ఎక్కువగా మూలికలు లేదా ఆక్యు ప్రెషర్ వంటి వైద్యం కోసం ప్రాధాన్యత ఇస్తారు.
స్థిరత్వం:
వీరు ఒక పనిని మొదలు పెట్టిన తరువాత మరో పని జోలికి వెళ్లరు. అది పూర్తయ్యాకే ఇంకో పని గురించి ఆలోచిస్తారు. దీంతో ఎలాంటి అదనపు ఒత్తిడికి గురి కాకుండా ఉంటారు.