ప్రభాస్ నటించిన కల్కి మరో రికార్డు సృష్టించింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. విడుదలకు ముందే ఎన్నో హోప్స్ ఉండి.. రిలీజైన తరువాత అంచనాలకు మించి పోయింది. ప్రారంభం రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తూ వస్తోంది. ఇటీవలే ఈ మూవీ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరింది. తాజాగా మరో రికార్డు సాధించింది.
ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన కల్కిలో ప్రభాస్ తో పాటు దీపికా పదుకునే, దిశా పటానీలు నటించారు. వీరితో పాటు అమితాబ్ బచ్చన్, కమలహాసన్, శోభన తదితరులు కనిపించారు. కల్కి పార్ట్ 2 కూడా ఉంటుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలిపారు. ఆమూవీకి సంబంధించిన పనుల్లో ఉన్నట్లు తెలిపారు. కల్కి పార్ట్ 1 ను రూ.600 కోట్లతో నిర్మించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరడంపై చిత్ర బృందం సంబరాలు చేసుకుంటోంది.
కాగా కల్కి తాజాగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు షారుఖ్ కాన్ జవాన్ మూవీ 12.01 మిలియన్ టికెట్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు కల్కి మూవీ 12.15 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడు పోయాయి. దీంతో షారుక్ ఖాన్ సినిమాను ప్రభాస్ మూవీ బీట్ కొట్టడంపై ఫ్యాన్ష్ ఖుషీగా ఉన్నారు.