అందాల తార జాన్వీ కపూర్ ఇప్పుడు ట్రెండీగా మారారు. వరుస సినిమాలతో బిజీ అయిన ఈ ముద్దుగుమ్మ లేటేస్టుగా ఓ హిందీ సినిమాతో వచ్చారు. ఈ మూవీ ఆగస్టు 2న రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ నాలుగో రోజు కలెక్షన్లు రూ.60 లక్షలు మాత్రమే. జాన్వీ కపూర్ తెలుగులో ఎన్టీఆర్ తో కలిసి ‘దేవర’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆమె నటించిన మూవీ కి నాలుగో రోజు కలెక్షన్లు రూ.60 లక్షలు రావడం చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ స్టార్ గా మారబోతున్న జాన్వీ కపూర్ లేటేస్టుగా ‘ఉలాజ్’ (UlaJh) అనే సినిమాలో నటించారు. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. సుదన్షు సారియా డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో జాన్వీ కపూర్ తో పాటు గుల్షన్ దేవయ్య, రోషన్ తదితరులు నటించారు. ఈ సినిమాను ఆగస్టు 2న థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ మూవీ నిర్మాణానికి రూ.50 కోట్లు వెచ్చించారు. అయితే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కలెక్షన్లు సాదా సీదాగా వచ్చాయి. ఆగస్టు 2న 1.5 కోట్లు వసూలయ్యాయి. రెండో రోజు 1.75 వచ్చాయి. మూడో రోజు రూ.2 కోట్లు వసూలు చేసింది.
అయితే నాలుగో రోజు మాత్రం రూ.60 లక్షల కలెక్షన్లు వచ్చాయి. ఇలా నాలుగు రోజుల వరకు రూ.5.5 కోట్లు వసూలయ్యాయి. అయితే అంతకుముందు జాన్వీ నటించిన సినిమా కంటే ఇది తక్కువ కావడం తో ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతోంది.అయితే తెలుగులో జాన్వీ కపూర్ కు ఇప్పటికే ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఇక్కడ మాత్రం అలా ఉండదని కొందరు అంటున్నారు. ఆమె నటిస్తున్న ‘దేవర’పై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.