డబ్బు సంపాదించడం అందరికీ తెలుసు. కానీ దానిని పొదుపు చేయడంలో చాలా మంది పొరబడుతున్నారు. చాలా మంది ఆదాయం పెరిగేందుకు బ్యాంకులో డబ్బును డిపాజిట్ చేయడం లేదా.. చిట్టీలు కట్టడం వంటివి చేస్తూంటారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ విధానం ఎక్కువగా ఉంటుంది. కొంత మంది గ్రూపుగా ఏర్పడి ప్రతీ నెల కొంత మొత్తం జమ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తంలో అవసరం ఉన్న వారు డబ్బును తీసుకుంటారు. దీనికి వడ్డీ కట్టాల్సి ఉంటుంది. కొందరు తమకు డబ్బు అవసరం లేకపోతే చివరి వరకు ఉండి తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల వడ్డీ ఎక్కువగా వస్తుందని అనుకుంటారు. ఇక డబ్బు అవసరం ఉన్నవారు.. ముందే డబ్బు తీసుకొని నెలనెలా వాటికి వడ్డీ కడుతూ ఉంటారు. అయితే ఇలా చిట్టీలు కట్టడం కంటే బ్యాంకులో రుణం తీసుకోవడం బెటర్ అని కొందరు చెబుతూ ఉంటారు. మరి ఈ రెండింటలో ఏదీ బెటర్?
- చిట్టీల్లో డబ్బు తీసుకున్నవారు దాదాపు 12 శాతం వడ్డీ రేటుతో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. చిట్టీల నుంచి డబ్బు తీసుకోవాలని అనుకునేవారికి పోటీ ఎక్కువగా ఉంటుంది. ముందుగా వేలం పాట వేసి ఎవరు ఎక్కువగా వడ్డీ చెల్లిస్తారో.. వారికే ఆ చిట్టీని ఇస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి లక్షరూపాయల చిట్టీ డబ్బులు కావాలంటే 80 నుంచి 90 వేల వరకు వస్తుంది. మిగతా మొత్తం వడ్డీతో కట్టాల్సి ఉంటుంది.
- డబ్బు అవసరం ఉన్న వారు చిట్టీల కంటే బ్యాంకు రుణం తీసుకోవాలని కొందరు చెబుతూ ఉంటారు. బ్యాంకు రుణం చిట్టీల కంటే కాస్త బెటర్. ఎవరికి అవసరం ఉంటే వారు రుణం తీసుకోవచ్చు. ఇతరులతో సంబంధం ఉండదు. ఇందులో లోన్ ను భట్టి వడ్డీ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.
- అత్యవసరం డబ్బు కావాలంటే చిట్టీల ద్వారానే తీసుకోవడం మంచిదని అంటున్నారు. ఎందుకంటే బ్యాంకు రుణం తీసుకోవాలని అనుకునేవారు.. డాక్యుమెంటేషన్ పూర్తి కావడానికి సమయం పడుతుంది. అయితే క్రెడిట్ కార్డు ద్వారా లోన్ తీసుకునేవారికి డాక్యుమెంటేషన్ అవసరం లేదు. కానీ వడ్డీ ఎక్కువగా ఉంటుంది.
- చిట్టీల ద్వారా డబ్బు తీసుకున్నవారు తిరిగి చెల్లించే సమయంలో గడువు తేదీ అటూ ఇటూ అయినా పర్వాలేదు. మర్యాదగా ప్రవర్తిస్తే మిగతా వారు అడ్జెస్ట్ అవుతారు. కానీ బ్యాంకు రుణం తీసుకున్నవారు గడువు తేదీ రోజున తప్పనిసరిగా చెల్లించాలి. అలా చెల్లించకపోతే మూడు రేట్ల వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈఎంఐ కట్టకపోయినా..మరోసారి రుణం వచ్చే అవకాశం ఉండదు. అయితే సమయానికి ఆదాయం వచ్చేవారికి మాత్రం ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు.
- చిట్టీల వల్ల మనుషుల మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది. గ్రూపులో అత్యవసరం ఎవరికి ఉందో.. వారిని గుర్తించి ఒక్కోసారి వేలం పాట లేకుండానే డబ్బుల ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో వడ్డీ తక్కువగా పడే అవకాశం ఉంది. కానీ బ్యాంకులో వ్యక్తి అవసరాలను గుర్తించరు. ఎవరికైనా.. ఒకే విధంగా వడ్డీ రేటును విధిస్తారు.
ఈ విధంగా వారి అవసరాలు, ఆదాయ మార్గాలకు అనుగుణంగా రుణం తీసుకునే ప్రయత్నం చేయాలి.





