Saturday, December 6, 2025

భార్యాభర్తలు ఈ స్టోరీ చదివితే ఇక ఎప్పటికీ విడిపోరు..

ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇద్దరూ తెలియని వ్యక్తులు జీవితాంతం ప్రయాణం చేయడానికి భార్యాభర్తల బంధం ఏర్పాటు చేసుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అయితే దాంపత్య జీవితం అంటే ఆషామాషి కాదు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటిని ఇద్దరూ తట్టుకుంటేనే ముందుకు వెళ్లగలుగుతారు. లేకుంటే వారి జీవితం మధ్యలోనే ఆగిపోతుంది. లేదా ఎవరికి వారు విడిపోతారు. అయితే వాస్తవానికి భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైనది. ఎంత పవిత్రమైనది అంటే ఒక్కోసారి ఒకరి నుంచి ఒకరు విడిపోకుండా జీవితాంతం కలిసి ఉండేలా పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితుల్లో ఇది ఒకటి.

ఒక నగరంలో దంపతులు జీవిస్తూ ఉంటారు. వీరిది ప్రేమ వివాహం. అయితే పెళ్లయి మూడేళ్లు నిండుతున్న క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి. దీంతో ఒకరికి ఒకరు మాట్లాడుకోకుండా ఉంటారు. అయితే Anniversary Day దగ్గరికి వస్తుంది. దీంతో భార్య తన మనసులో తన భర్త Sorry చెప్పాలని కోరుకుంటుంది. మొత్తానికి పెళ్లిరోజు రానే వచ్చింది.. అయితే ఈరోజు తన భర్త Sorry చెబుతాడు అని అనుకుంటూ ఉంటుంది. కానీ భర్త మాత్రం బెట్టు దిగడం లేదు. అయితే భర్త ఎలాంటి సారీ చెప్పకుండా ఉదయం ఎప్పటిలాగే రెడీ అయి ఉద్యోగానికి వెళ్తాడు. కనీసం సాయంత్రం వరకైనా సారీ చెబుతాడు అని అనుకుంటుంది.

అయితే సాయంత్రం కాగానే ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. ఎంతో సంతోషంతో డోర్ దగ్గరికి వచ్చిన భార్య తలుపు తీయగానే భర్త పూలతో కనిపిస్తాడు. సారీ చెప్పేదాక మాట్లాడొద్దు అని అనుకుంటుంది. ఇంతలో తన మొబైల్ రింగ్ అవుతుంది. తన భర్త పేరు ఉన్న ఆధార్ కార్డు ఇక్కడ పడిపోయింది.. అది ఉన్న ఆ వ్యక్తి ప్రమాదంలో చనిపోయాడు.. అని పోలీసుల చెబుతారు. దీంతో షాక్ తిన్న ఆమె.. అదేంటి ఇప్పుడే నాకు కనిపించాడు.. ఈ ఫోన్ ఏంటి.. అని ఆందోళన చెందుతుంది. అయితే తిరిగి చూసేసరికి తన భర్త కనిపించడు. ఇల్లంతా వెతుకుతుంది ఎక్కడా ఉండడు. మరి నాకు కనిపించిన వ్యక్తి ఎవరు? అని ఆందోళన చెందుతుండగా.. ఒకవేళ ఆత్మ వచ్చి చివరి క్షణంలో పలకరించిపోయిందా? అని ఇలా తన మనసులో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి.

అప్పుడు భార్య ఒక విషయం అనుకుంటూ బాధపడుతుంది. బతికి ఉండగానే సారీ చెప్తే బాగుండు.. ఇప్పుడు సారీ చెప్పడానికి తన భర్త లేడు అని కన్నీరు పెట్టుకుంటుంది. ఆ తర్వాత తన భర్త డెడ్ బాడీ రిసీవ్ చేసుకుందామని రెడీ అవుతుంది.

కానీ ఆశ్చర్యకరంగా తన భర్త బాత్రూంలో నుంచి బయటకు వస్తాడు.. రాగానే అదేంటి నువ్వు చనిపోయావని ఫోన్ వచ్చింది అని అంటుంది. అప్పుడు ఆ భర్త ఒక ఆశ్చర్యకరమైన సమాధానం ఇస్తాడు. నా పర్సు ఎవరో కొట్టేశారు. బహుశా పరస్ కొట్టేసిన వ్యక్తి చనిపోవచ్చు. అందులో నా ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటివి ఉన్నాయి అని అంటాడు. అప్పటికే ఎంతో వేగంగా కొట్టుకుంటున్న భార్య గుండె వెంటనే వేగం తగ్గించకుంది. ఒక్కసారిగా తన ముఖంలో ఆనందం వెళ్లి విరుస్తుంది.

దీంతో భార్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన భర్తకు సారి చెబుతుంది. ఆ తరువాత భర్త కూడా సారీ చెబతాడు. నేను కూడా తప్పు చేశాను.. అని అంటాడ. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆనివర్సరీ వేడుకలు సంతోషంగా జరుపుకుంటారు.

ఇలా భార్యాభర్తల మధ్య ఎవరో ఒకరు ముందడుగు వేసి తమ తప్పులను క్షమించమని అడిగితే ఇద్దరూ జీవితాంతం కలిసి ఉండవచ్చు. ఇక్కడ భర్త కూడా తన భార్య మనసు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించాలని అనుకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News