Thursday, March 5, 2026

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. ఏ దేశానికి ఎంత నష్టం?

ఇరాన్, ఇజ్రాయెల్ – అమెరికా మధ్య ఫిబ్రవరి 28, 2026 నుంచి మొదలైన యుద్ధం మిడాల్ ఈస్ట్ దేశాలకు తీవ్ర నష్టాలు కలిగించింది. ఈ వార్ లో ఇరాన్ అత్యధిక మరణాలు, ఇజ్రాయెల్, అమెరికాలో ఆర్థిక నష్టాలు, గల్ఫ్ దేశాల్లో మిస్సైల్ దాడుల వల్ల ప్రాణాంతక గాయాలు సంభవించాయి. 2026న ఫిబ్రవరి 28 అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై ఎయిర్ స్ట్రైకులు చేశాయి. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా ఖమేనీ మరణానికి దారితీసాయి. ఇరాన్ ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా బేస్ లతో పాటు వాటి మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలపై మిస్సైల్స్, డ్రోన్‌లు ప్రయోగించింది. దీంతో ఇరాన్ హర్ముజ్ జలసంధి మూసివేసింది. ఫలితంగా యుద్ధం జరుగుతున్న దేశాలకే కాకుండా మిగతా దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయి.

ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం కారణంగా లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చు, కానీ ఖచ్చిత అంచనాలు లేవు.

ఇజ్రాయెల్ నష్టాలు
ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. $2.93 బిలియన్ల (9.4 బిలియన్ షెకెల్స్) నష్టం. రెడ్ రెస్ట్రిక్షన్ల వల్ల. మొత్తం ఆస్తి డ్యామేజ్ $6 బిలియన్లు (పాత అంచనా), పెట్టుబడులు ఆగిపోయాయి. స్కూళ్లు మూసివేత, రిజర్వ్ ఫోర్సెస్ కాల్-అప్ ముఖ్య కారణాలు.

అమెరికా నష్టాలు
సైనిక అసెట్స్ $1.9 బిలియన్లు (జెట్లు, రాడార్లు, సాట్ ఎక్విప్‌మెంట్) నష్టం. మొత్తం మిలిటరీ కాస్ట్ $40-95 బిలియన్లు. ఆర్థికంగా $50-210 బిలియన్లు (ట్రేడ్, ఎనర్జీ డిస్‌రప్షన్ వల్ల)నష్టం. మొదటి 24 గంటల్లో $700 మిలియన్లు ఖర్చు.

ఇరాన్ నష్టాలు
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆయిల్ ఫీల్డ్స్ డ్యామేజ్; సంక్షన్లు మరింత తీవ్రం. మొత్తం GDP 1-2% నష్టం అంచనా, కానీ ఖచ్చిత ఫిగర్లు అందుబాటులో లేవు. సుప్రీం లీడర్ ఖమేనీ మరణం, సైనిక్ సైట్లు ధ్వంసం.

మొత్తం ప్రభావం
గ్లోబల్ ఆయిల్ ధరలు $80+కి పెరుగుదల. స్టాక్ మార్కెట్లు 1-2% క్షీణించాయి.

దేశాలవారీ నష్టాలు

దేశంమరణాలుగాయాలుఇతర నష్టాలు
ఇరాన్787+వేలాదిసైనిక, పౌర ప్రాంతాలు, స్కూల్‌లపై దాడులు, ఆర్థిక అస్థిరత
ఇజ్రాయెల్9-11+121+3 నుంచి 6 బిలియన్ల ఆర్థిక నష్టం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్
UAE3-458+దుబాయ్ ఎయిర్‌పోర్ట్, హోటళ్లు, స్కైస్క్రాపర్లపై ప్రభావం
ఇరాక్25US బేసులపై దాడులతో ఆయిల్ ఫీల్డ్స్ ఉత్పత్తి ఆగిపోయింది
కువైట్132ఎయిర్‌పోర్ట్, నగరాలపై దాడులు
ఖతార్16ఎనర్జీ ఫెసిలిటీస్, దోహా నగరాలు ప్రభావితం
ఒమాన్5పోర్టులు, ఆయిల్ ట్యాంకర్లపై దాడులు
బహ్రీన్4మనామా నగరాలు దెబ్బతిన్నాయి
సౌదిరియాడ్ యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడి, తక్కువ డ్యామేజ్
జోర్డాన్5ష్రాప్నెల్ గాయాలు, ఎయిర్‌స్పేస్ మూసివేయబడింది
ఇవి మార్చి 1 వరకు.. ఆ తరువాత జరిగిన పరిస్థితులతో అంకెలు మారవచ్చు. (ఆన్ లైన్ లో లభించిన సమాచారం ప్రకారం..)

చమురుపై ప్రభావం..

ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం కారణంగా ఇరాన్ హర్ముజ్ స్ట్రెయిట్ మూసివేసింది. దీంతో చాలా వరకు షిప్పింగ్ ఆగిపోయింది. ఫలితంగా చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆఫ్-మార్కెట్ ట్రేడింగ్‌లో 10శాతం పెరిగి బారెల్ ధర 80 డాలర్లకు చేరింది.
​US క్రూడ్ (WTI) 7.5% పెరిగి $77/బారెల్, ముందు $82 దాటింది.
మార్చి 1 నుంచి మార్కెట్లు 6-11% జంప్ చేశాయి; $100/బారెల్ అవకాశం.

ఇరాన్ హర్ముజ్ స్ట్రెయిట్ మూసివేసి, ట్యాంకర్లు ఆపింది, ఇది సౌది, UAE, ఇరాక్, కువైట్ ఎగుమతులను ప్రభావితం చేసింది. ఇరాన్ ఉత్పత్తి (ప్రపంచ 6వ స్థానం) ఆగిపోయింది, OPEC+ ఉత్పత్తి పెంచినా ధరలు పెరిగాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News