హైదరాబాద్ కు ఆదివారం మినహా మిగతా రోజుల్లో వెళ్లాలంటే భయం వేస్తుంది. ముఖ్యంగా ఉదయం 9 గంటలకు.. సాయంత్రం 6 నుంచి 9 గంటలకు ట్రాఫిక్ లో చిక్కుకుంటే బయటపడడం కష్టం. ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా కాస్త ప్రయోజనం ఉన్నా.. సిటీ సెంటర్లోకి వెళ్లాలంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. దీంతో చాలా మంది భాగ్యనగరానికి ప్రయాణం చేసేవారు ప్రణాళికను వేసుకుంటూ ఉంటారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎంత కష్టమో.. ఇక్కడ పార్కింగ్ కూడా అంతే భయం వేస్తుంటూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడా ప్రత్యేకమైన స్థలం లేకపోవడంతో పార్కింగ్ ఇబ్బందులు తప్పడం లేదు. అయితే మిగతా దేశాల్లో ఈ సమస్యను గుర్తించి వాటి పరిష్కారానికి ఆటోమేటెడ్ పార్కింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మనదేశంలోకూడా ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. అందులోనూ హైదరాబాద్ లో నాంపల్లిలో ఆటోమేటేడ్ పార్కింగ్ ప్రాజెక్టును పూర్తి చేశారు. మరి ఇది ఎలా పనిచేస్తుందంటే?
హైదరాబాద్ లోని నాంపల్లిలో ఆటోమేటేడ్ పార్కింగ్ ప్రాజెక్టును పూర్తిచేశారు. రూ.102 కోట్ల రూపాయలో ‘నోవస్’ అనే సంస్థ దీనిని నిర్మించింది. ఈ భవనం మొత్తం 15 అంతస్థుల్లో ఉంటుంది. ఇందులో 10 అంతస్థులు పార్కింగ్ కోసం కేటాయించారు. 250 కార్లు, 200 ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు. అయితే ఈ భవనంలో షాపింగ్ కాంప్లక్స్ తో పాటు సినిమా థియేటర్ కూడా ఉంటుంది. మానవ రహితంగా ఆటోమేటిక్ గా పార్కింగ్ అయ్యే ఈ విధానం ఇప్పటికే విదేశాల్లో అములో ఉంది.
ఆటోమేటేడ్ కార్ పార్కింగ్ సిస్టమ్ ఇలా పనిచేస్తుంది..
మీ కారు భవనం వద్దకు రాగానే ఒక ప్రత్యేక ఎంట్రీ బూత్ వద్ద ఆపుతారు. అక్కడ సిస్టమ్ కార్ సైజు, వెయిట్‌ని స్పెన్సర్లతో చెక్ చేస్తుంది.డ్రైవర్ మరియు ప్యాసింజర్స్ కారులోనుండి బయటికి వస్తారు.కారు ఒక ప్లాట్‌ఫారమ్‌పై నిలిపి ఉంచబడుతుంది. ఆ ప్లాట్‌ఫారమ్ లిఫ్ట్‌లా పనిచేసి కారును పైకి, కిందకి లేదా సైడ్‌కి మోవ్ చేస్తుంది. కొన్ని సిస్టమ్స్‌లో “కన్వేయర్ బెల్ట్” లేదా “రోబోటిక్ డాలీ” ఉంటుంది. కంప్యూటర్ కంట్రోల్ సిస్టమ్ ఫ్రీ పార్కింగ్ స్పాట్‌ను గుర్తిస్తుంది. లిఫ్ట్ లేదా రోబోటిక్ సిస్టమ్ కారును ఆ స్పాట్‌కి మోవ్ చేస్తుంది. సెన్సర్లు కారు సరిగ్గా నిలిచిందా? లేదా? అని చెక్ చేస్తాయి. పార్క్ చేసిన కారును తిరిగి తీసుకువెళ్ళాలనుకుంటే, సిస్టమ్‌లో టికెట్ లేదా యాప్ ద్వారా రిక్వెస్ట్ చేస్తారు. కంప్యూటర్ ఆ కార్ స్పాట్‌ను గుర్తించి, లిఫ్ట్/రోబోట్ ద్వారా ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్‌కి తీసుకొస్తుంది.
ఈ సిస్టమ్ లో స్పెన్సర్లు (Ultrasonic, Infrared)కారు పొజిషన్, సైజు చెక్ చేస్తాయి. PLC (Programmable Logic Controller) – మొత్తం ప్రాసెస్‌ని కంట్రోల్ చేస్తుంది. లిఫ్టింగ్ మెకానిజమ్స్ – కారును పై/కింద/సైడ్‌కి మూవ్ చేస్తాయి. కెమెరాలు – మానిటరింగ్ మరియు సేఫ్టీ కోసం.. సాఫ్ట్‌వేర్ – పార్కింగ్ స్పేస్ ఆప్టిమైజేషన్, యూజర్ రిక్వెస్టుల కోసం పనిచేస్తుంది.
ఆటోమేటేడ్ కార్ పార్కింగ్ సిస్టమ్ తో స్పేస్ సేవ్ అవుతుంది (సాంప్రదాయ పార్కింగ్ కంటే 50% వరకు). సమయం తగ్గుతుంది. డ్రైవర్ మాన్యువల్‌గా పార్క్ చేయాల్సిన పని లేదు. భద్రత ఎక్కువ (ఎందుకంటే పార్కింగ్ ఏరియాలోకి ఎవ్వరూ వెళ్లరు)
ఇప్పటి వరకు ఏయే దేశాల్లో అమల్లో ఉంది?
కువైట్ లో అల్ జహ్రా (Al Jahra) లోనే ప్రపంచంలోనే అత్యంత భారీ ఆటోమేటెడ్ పార్కింగ్ ఫేసిలిటీ ఉంది. ఇందులో 2,314 కార్లను పార్కింగ్ చేసుకోవచ్చు. జర్మనీలోని వోల్ఫ్స్‌బర్గ్‌లో ప్రపంచంలోనే వేగంగా కార్ తిరిగి తెప్పించే APS (సమయం 1 నిమిషం 44 సెకన్లు) సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈడెన్మార్క్ దేశంలోని ఆర్కస్ (Aarhus)లోని Dokk1లో యూరోప్‌లో అత్యంత పెద్ద APS ఉంది. ఇందులో 20 అంతస్థుల్లో సుమారు 1,000 కార్లు పార్క్ చేయొచ్చు.అమెరికాలోని వాషింగ్టన్ లో 1951లో తొలిసారి డ్రైవర్‌లెస్ పార్కింగ్ గ్యారేజ్ ప్రారంభమైంది. 2002లో Hoboken, New Jerseyలో రోబోటిక్ పార్కర్ వ్యవస్థ ప్రారంభయింది.





