వర్షాకాలం ప్రారంభం కాగానే పరిసరాల పరిశుభ్రత పాటించాలని కొందరు ఆరోగ్య నిపుణుల చెబుతూ ఉంటారు. ఈ సమయంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని ఆహార పదార్థాలు కల్తీగా మారే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో కొందరు తమ వ్యాపారం కోసం ఆహార పదార్థాలతో పాటు కొన్ని ద్రవాలను కల్తీమయంగా చేస్తున్నారు. దీంతో వీటిని ప్రజలు తీసుకోవడం వల్ల ప్రాణాలు హరిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో కల్తీ కల్లు తాగి గురువారం ఉదయం వరకు 5గురు మృతి చెందారు. మరో 31 మంది అస్వస్థతకు గురయ్యారు. కల్లులో మొతాదుకు మించి కొన్ని పదార్థాలను కలపడం వల్ల.. ఆ కల్లున తాగిన తరువాత ఇది జరిగిందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలుపుతున్నార. ఈ మేరకు కల్లు దకాణాల నుంచి శాంపిల్స్ సేకరించారు. అసలు కల్లు కల్తీగా ఎలా మారుతుంది? స్వచ్ఛమైన కల్లు ఎలా ఉంటుంది?
ఈత, తాటి కల్లు తాగడం వల్ల శరీరానికి ఎంతో ఆరోగ్యకరం. ప్రకృతినుంచి సహజ సిద్ధంగా లభించే దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. జీర్ణక్రియ సమస్యలు మాయమవుతాయి. కిడ్నీలో రాళ్లు ఉంటే బయటకు వెళ్తాయని అంటుంటారు. అయితే స్వచ్ఛమైన కల్లు తాగినప్పుడు మాత్రమే ఈ ప్రయోజనాలు ఉంటాయి. స్వచ్ఛమైన కల్లు అంటే..? ఎక్కడైతే తాటి లేదా ఈత చెట్లు ఉంటాయో.. అక్కడ చెట్టు మీది నుంచి కిందికి దించిన తరువాత వెంటనే దానిని సేవించడం స్వచ్ఛమైన కల్లును తీసుకున్నవారవుతారు. అలా కాకుండా చెట్టుమీది నుంచి కిందికి దించిన కల్ల ఎక్కువ సేపు నిల్వ ఉండడం వల్ల ఈ కల్లు వాతావరణ పరిస్థితులకు రుచి మారుతుంది. ఇదే సమయంలో కల్లు కల్తీగా మారే అవకాశం ఉంది.
కల్లు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పడంతో కొందరు దీనిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారు. గ్రామాల్లో అయితే ప్రతిరోజూ ‘వాటిక’ పేరుతో ప్రతిరోజూ కల్లు తీసుకుంటార. ఇదే సమయంలో పట్టణాల్లో, నగరాల్లో ఉండేవారు సైతం ఈ కల్లు తాగాలని అనుకుంటారు. అయితే ఇక్కడ ఈత, తాటి చెట్లు ఉండవు. దీంతో కల్ల డిపోల ద్వారా కల్లు విక్రయిస్తుంటారు.
అయితే ఈ కల్లును తాటి చెట్ల నుంచి నేరుగా విక్రయించడం ద్వారా వారికి ఎలాంటి లాభాలు రావు. దీంతో గ్రామాల నుంచి కల్లు సేకరించిన తరువాత ఇది ఎక్కువగా కాలం నిల్వ ఉండడానికి ఇందులో రకరకాల పదార్థాలు కలుపుతూ ఉంటారు. ఈ కల్లు టేస్టీగా ఉండడానికి, మత్తు ఎక్కువగా రావడానికి యూరియాతో పాటు కుంకుడు కాయల రసం, శాక్రిన్ పొడి, బియ్యం పిండిని కలుపుతారు. అయితే ఇవి తగిన మోతాదులో కలపడం వల్ల అనారోగ్యమే అయినా ప్రాణాలు పోయే సమస్యలు ఉండకపోవచ్చు. కానీ ఒక్కోసారి కల్లులో పై పదార్థాలు మోతాదుకు మించి కలపడం వల్ల ఇలా ప్రాణాలు పోతుంటాయి.
పట్టణాలు, నగరాల్లో కల్లు డిపోల్లో విక్రయించే కల్లును కొన్ని రోజుల పాటు సేవించిన తరువాత దీనికి బానిసగా మారుతారు. ఆ తరువాత ఇది లేకపోతే వారు మనసు ఆందోళనగా ఉంటుంది. ఇలా కొన్ని రోజులు దొరకకపోతే పిచ్చివాళ్లలాగా ప్రవర్తిస్తారు. కరోనా సమయంలో అదే జరిగింది. ఇక ప్రస్తుతం కూకట్ పల్లిలో జరిగిన ఘటనలో కల్తీకల్లును విక్రయించి 7గురిని అదుపులోకి తీసుకున్నారు.





