ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎలక్షన్ కమిషన్ నిత్యం ప్రచారం చేస్తూ ఉంటుంది. అయితే చాలామంది తమ పనులు కారణంగా లేక స్థానికంగా లేని కారణంగా ఓటు వేయకుండా ఉంటారు. అయితే కొందరు వృద్ధులు, గర్భిణులు, ఇతర అనారోగ్య సమస్యలతో ఉండేవారు ఓటు హక్కు ఉన్న వారు వేయలేక పోతారు. ఇలాంటివారు చాలావరకు ఇప్పటివరకు ఓటు హక్కును కోల్పోయారు. కానీ ఇప్పుడు వీరు కూడా ఓటు వేసేందుకు అవకాశం వచ్చింది. మీరు ఇంట్లో ఉంటూనే మొబైల్ ద్వారా ఓటింగ్ చేసుకోవచ్చు. దేశంలో తొలిసారిగా బీహార్ లో జరిగే ఎన్నికల్లో మొబైల్ ఓటింగ్ ను ప్రవేశపెడుతున్నారు. ఈ మొబైల్ ఓటింగ్ ఎలా వేస్తారు అంటే?
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఇది సాంకేతికంగా వినియోగించుకుంటున్నారు. అలాగే ఎలక్షన్ విషయంలోనూ అనేక రకాలుగా టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. గతంలో టెక్నాలజీ లేకపోవడం వల్ల రిగ్గింగ్ తదితర సమస్యలు ఉండేవి. కానీ ఇప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఓటింగ్ లో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఓటింగ్ కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఓటింగ్ కేంద్రానికి రాలేని వారు మొబైల్ ద్వారానే ఓటు వేయవచ్చు. మొబైల్లో E-SEH BHR మొబైల్ యాప్ ద్వారా ఓటు వేయవచ్చని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ యాప్ ఓపెన్ చేయగానే ఫేస్ రికగ్నైజేషన్ చేస్తుంది. ఫేస్ ద్వారా వివరాలన్నీ తెలిపిన తర్వాత ఓటింగ్ వేసుకోవచ్చు. ఈ యాప్ బ్లాక్ చైన్, ఫేస్ మ్యాచింగ్, స్కానింగ్ వంటి సదుపాయాలతో ఎలాంటి రాంగ్ ఓటు లేకుండా చేస్తుంది. ఈ యాప్ ద్వారా ఓటింగ్ కేంద్రానికి రాలేని ప్రతి ఒక్కరు వినియోగించుకోవచ్చు. అయితే ఇందుకోసం ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక మొబైల్ లో ఇద్దరు మాత్రమే రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ మొబైల్ లోనే అందుబాటులోకి వచ్చింది.
మొబైల్ ద్వారా ఓటు వేయాలని అనుకునేవారు ముందుగా పై యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓటర్ ఐడి కి లింక్ అయినా మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకోవాలి. ఇందులో ఆధార్ వంటి ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వివరాలను చూసిన తర్వాత ఓటింగ్ చేయడానికి ఆక్సిస్ అవుతుంది. అయితే ఎన్నికల సమయంలోనే ఇది పనిచేసేలా రెడీగా ఉంటుంది. ఓటు వేసిన తర్వాత సక్సెస్ అని మెసేజ్ వస్తుంది. అయితే ఈ యాప్ పనిచేయడానికి ఇంటర్నెట్ తప్పనిసరిగా అవసరం.





