తిరువనంతపురంలో శ్రీ పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఖజానాను నేల మాలిగలో దాచినట్లు చెబుతారు. ఆలయం కింద ఉన్న ఒక గదిలో అపారమైన సంపద ఉందని.. ఈ సంపదను పాములు రక్షిస్తున్నాయని పేర్కొంటారు. అందుకు ప్రతిగా ఈ గదికి ఉన్న తలుపుపై పాముల చిత్రాలను కూడా ఉంటాయి..
పూరి జగన్నాథ్ ఆలయంలో స్వామి నిధిని పాములు రక్షిస్తున్నాయని స్థానికులు చెప్పారు. అయితే 11 మంది సభ్యులతో కూడిన బృందం దీనిపై పరిశోధనలు చేయగా వారికి పాములు కనిపించలేదు.
(వీడియో కోసం కిందికి వెళ్లండి)
ఇలా పురాతన కాలంలో రాజులు.. చక్రవర్తులు తమ నిధులను దాచే క్రమంలో పాములను కూడా అందులో చేర్చారని చెబుతూ ఉంటారు. అలాగే కొన్ని సినిమాల్లో చూపించిన ప్రకారం కూడా భూగర్భంలో ఉన్న నిధులను పాములు రక్షిస్తున్నట్లు చెబుతూ ఉంటారు. వాస్తవానికి పాములకు దొంగలు ఎవరో..? దొరలు ఎవరు తెలియదు. అవి కేవలం తమ రక్షణ కోసం మాత్రమే దాడులు చేస్తుంటాయి. మరి ఆ నిధులను పాములు ఎలా కాపాడుతాయి?
సింహం, గద్ద, పాము యుద్ధంలో ఎవరు గెలిచినట్లు? వీడియో వైరల్ – insightearth.in – Telugu News Portal
పురాతన కాలంలో ధనం బంగారం రూపంలో ఉండేది. రాజులు, చక్రవర్తుల మధ్య బహుమతులు, ఇతర సంపాదన రూపంలో బంగారాన్ని ఎక్కువగా నిలువ చేసుకునేవారు. కొందరు రాజుల వద్ద నాణేలు కూడా ఉండేవి. అయితే ఆ కాలంలో ఎక్కువగా శత్రువుల భయం ఉండేది. వీరు దాడి చేసి సంపదను దోచుకుని వెళ్లేవారు. వీరు నుంచి రక్షించుకునేందుకు సొమ్మునంత పాతిపెట్టి భద్రపరిచే వారు. ఇదే సమయంలో వాటికి రక్షణగా కొందరు పాములను ఉంచేవారని చెబుతున్నారు. అయితే పాములను ఉంచడం వల్ల భయపడి ఆ సొమ్మును తీసుకు వెళ్లేవారు కాదు. అయితే కొందరు ఇలా దాచిన సొమ్ములో ఎలాంటి పాములను చేర్చకపోయినా ప్రచారం చేసేవారు. దీంతో అది భద్రంగా ఉండేది. అలా ఆ నిధులు భూమిలోనే ఉండిపోాయాయి. పురావస్తు తవ్వకాల్లో బయటపడుతున్నాయి.
సొమ్ము ఉన్నచోట ఎలాంటి పాములు ఉండవు అని కొందరు చెబుతున్నా.. కొన్ని వీడియోలను చూస్తే మాత్రం నిజమే అనిపిస్తుంది. ఈ వీడియోలో కూడా బంగారంతో పాటు కొన్ని నిధులను భద్రపరిచి అందులో పాములు చేర్చారు. మరి దానిని పూర్తిగా చూడండి..





