కరీంనగర్: రామడుగు మండల కేంద్రం కురుమ సంఘ భవనములో మండల కురుమ సంఘం అధ్యక్షులు కడారి వీరయ్య కురుమ ఆధ్వర్యములో కురుమ సర్పంచులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు కడారి అయిలన్న కురుమ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. నీతి -నిజాయితీకి మారు పేరుగా ఉన్న కురుమ సంఘం నాయకులకు అవకాశమిచ్చిన ఇతర వర్గాల ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఇప్పుడిప్పుడే రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న కురుమలు రామడుగు మండలములో ఏడు గ్రామాలలో సర్పంచ్ లుగా పోటీ చేసి, ఆరు గ్రామాల్లో ఎన్నిక కావడం చాలా సంతోషించదగ్గ విషయం అన్నారు. 23 గ్రామ పంచాయితీలున్న రామడుగు మండలములో 25 శాతం గ్రామాల్లో కురుమలను ఆదరించిన ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమాల్లో దేశరాజుపల్లె సర్పంచ్ ఎల్కపెల్లి దేవమ్మ – లచ్చయ్య, కొరటపల్లి సర్పంచ్ మేకల మహేశ్వరి – ప్రభాకర్, పందికుంట (కురుమపల్లె) సర్పంచ్ దయ్యాల లత – వీరమల్లు, వన్నారం సర్పంచ్ గుంట ఓదెలు (ఓం ప్రకాష్), రామచంద్రాపూర్ సర్పంచ్ కడారి రాజేష్, రంగసాయిపల్లె సర్పంచ్ గుడ్ల శేఖర్, వెలిచాల ఉప-సర్పంచ్ ఎల్లమ్మల కృష్ణంరాజు, కొక్కెరకుంట ఉప-సర్పంచ్ ఎముండ్ల కుమార్, పందికుంట (కురుమపల్లె) ఉప-సర్పంచ్ బీర్ల వినోద్, కురుమ యువత జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లమ్మల నరసింహరాజు, మండల సంయుక్త కార్యదర్శి కచ్చు లింగయ్య, వన్నారం అధ్యక్షులు సేవ్వాల్ల పోచయ్య, రామడుగు పెద్ద కురుమ కడారి అయిలయ్య, అధ్యక్షులు కడారి రాయుడు, కార్యదర్శి గుమ్ముల పెద్ద కిష్టయ్య, యూత్ ప్రెసిడెంట్ కడారి రాజు, మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ ఎల్కపెల్లి కొమురయ్య తదితర సంఘం నాయకులు పాల్గొన్నారు.





