ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కరినే నిలబెట్టాలని అనుకున్నాం. ఇందుకోసం దాసోజు శ్రావణ్ పేరును సూచించారు . కానీ హరీష్ రావు ఇంటర్నల్ గా బిజెపి నాయకులతో మాట్లాడారు. మీ దగ్గర నుంచి ఒక కాండెడ్ ను ఇవ్వండి.. కెసిఆర్ గారిని అడిగి మరో కాండిడేట్ను నిలబెడతా అని చెప్పారు. ఇప్పటికే పార్టీ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు మిగతా పార్టీలోకి వెళ్లారు. ఇలాంటి సమయంలో రెండో అభ్యర్థి ఉంటే అయోమయానికి గురయ్యే ఛాన్స్ లేదా? అయితే ఒక మహిళ నాకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పింది.. కెసిఆర్ గారి పర్మిషన్ ఉందా? హరీష్ రావు గారు ఇలా అంటున్నారు అని తెలిపింది. అప్పుడు నేను ఆ విషయాన్ని కెసిఆర్ కు చెప్పాను. రెండో క్యాండిడేట్ను బరిలోకి దింపుదామా నాన్న.. అని అడిగితే అవసరం లేదని చెప్పాడు. వెంటనే అసలు విషయం నాన్నకి చెప్పాను..
దీనిని బట్టి తెలుస్తుంది హరీష్ రావు గారు ట్రబుల్ షూటర్ కాదు అని.. నేను పార్టీ కార్యకర్తలకు చెప్పేది ఏంటంటే పార్టీలో పెద్ద స్థాయిలో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి… అని కవిత కుండబద్దలు కొట్టారు.





