ఇండియన్ క్రికెటర్ హార్థిక్ పాండ్యా ఐపీఎల్ 2024లో ప్రత్యేకంగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని అందుకున్న ఆయన పేవల ప్రదర్శన చేశాడు. మొత్తం 14 మ్యాచుల్లో పది ఓటమికి కారణమయ్యాడు. దీంతో ఈ జట్టు అట్టడుగు స్థానానికి చేరడంతో క్రికెట్ ఫ్యాన్స్ పాండ్యాపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్స్ చేశారు. ఈ క్రమంలో అతడు తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పాండ్యా, తన భార్య నటాషా స్టాంకో విచ్ తో విడాకులు తీసుకుంటే 70 శాతం భరణాన్ని చెల్లిస్తారని కూడా అంటున్నారు. అసలు పాండ్యాకు ఎలాంటి ఆదాయం వస్తుంది? అతనికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి?
హార్థిక్ పాండ్యా కు మొత్తం 11 మిలియన్ డాలర్లు (రూ.91 కోట్ల) ఆస్తులు ఉన్నాయి. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని ముంబైలో రూ.30 కోట్లు , గుజరాత్ లోని వడోదరలో రూ.2 కోట్ల ఖరీదైన ఇళ్లు ఉన్నాయి.బీసీసీఐ నుంచి నెలకు రూ.2 కోట్ల సాలరీ అందుకుంటున్నాడు. స్టార్ స్పోర్ట్స్, గల్ప్ ఆయిల్ వంటి ప్రకటనల ద్వారా 55 నుంచి 60 లక్షల ఆదాయం వస్తుంది. ఇక హార్థిక్ పాండ్యా వద్ద లంబోర్ఘిని, రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటి విలువ రూ.1.5 కోట్లు. వ్యక్తిగత ఆస్తులు రూ.5.2 కోట్లు ఉన్నాయి. మ్యాచ్ ల ద్వారా పాండ్యా భారీగానే ఫీజు అందుకుంటాడు.
వన్డే మ్యాచ్ కోసం రూ.6 లక్షలు, టెస్ట్ మ్యాచ్ కోసం రూ.5 లక్షలు, టీ 20 మ్యాచ్ ఫీజు 3 లక్షలు గా ఉంది. ఐపీఎల్ 2024 మ్యాచ్ కోసం రూ.15 కోట్లు అందుకున్నాడు. మిగతా ఆటగాళ్ల మాదిరిగానే హార్థిక్ పాండ్యా ఆస్తులు బాగా పెరిగాయి. క్రికెట్ రంగంలో ఆయన సాధించిన విజయాలో చాలా మంది ఫ్యాన్స్ పెరిగారు. దీంతో అతని ద్వారా ప్రకటనల కోసం కొన్ని కంపెనీలు క్యూ కడుతున్నాయి. దీంతో అతనికి అదనపు ఆదాయం చేకూరుతుంది. ఇదిలా ఉండగా రియల్ ఎస్టేట్ రంగంలోనూ పాండ్యా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఇవి లాభాల్లో కొనసాగుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా హార్థిక్ పాండ్యా, నటాషా స్టాంకో విచ్ లు కరోనా సమయంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి మధ్య దూరం పెరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నటాషా తన సోషల్ మీడియా ఖాతాలో చివరగా ఉన్న పాండ్యా పేరును తొలగించింది. అంతేకాకుండా మార్చి 4న నటాషా బర్త్ డే. ఈరోజున పాండ్యా ఎలాంటి విషెష్ చెప్పలేదు. దీంతో వీరిద్దరి మధ్య చెడిందని అంటున్నారు. అయితే అటు పాండ్యా, ఇటు నటాషా మాత్రం అధికారికంగా ప్రకటన చేయలేదు. వీరికి అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు.