సెప్టెంబర్ 22 తర్వాత జిఎస్టి 2.0 అమలు అవుతుందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దీంతో చాలా వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం సైతం ధరలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అయితే సెప్టెంబర్ 22 తర్వాత కూడా కొన్ని షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్ స్టోర్ సెంటర్లు ధరలు తగ్గించడం లేదు. తమ దగ్గర పాత స్టాకు మాత్రమే ఉందని.. వాటి ప్రకారమే ధరలు చెల్లించాలని అంటున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఈ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
సెప్టెంబర్ 22 తర్వాత చాలావరకు వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. టీవీలు, ఫ్రిడ్జ్, కార్లు, మొబైల్స్ పై భారీగా జిఎస్టి తగ్గించారు. నిత్యవసర వస్తువులపై ఐదు శాతం జీఎస్టీకి తగ్గించారు. జీవిత బీమా, ఆరోగ్య బీమాపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేశారు. దీంతో వీటి ధరలు తగ్గే అవకాశం చాలా ఉన్నాయి. కానీ కొంతమంది పాత ప్రకారమే చెల్లించాలని అంటున్నారు. అంతేకాకుండా సూపర్ మార్కెట్లో వచ్చే ఢిల్లీలో జీఎస్టీ పాత విధంగానే విధిస్తున్నారు.
ఇలాంటి సమస్య వచ్చినప్పుడు 18001140001915 అనే నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. సెప్టెంబర్ 22 నుంచి ఎలాంటి పాత వస్తువు అయినా కొత్త జీఎస్టీని అమలు చేసి విక్రయించాల్సిందే. ఈ వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్ అంతకు ముందు అయినా సరే.. సెప్టెంబర్ 22 తర్వాత కొత్త జీఎస్టీని అమలు చేసి వస్తువుల ధరలు తగ్గించాల్సిన అవసరం ఉంది. కానీ కొందరు అలా చేయడం లేదు. ఇలాంటి వారి విషయంలో ఈ నెంబర్ ఎంతో ఉపయోగపడుతుంది.





