రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సోదరుకలు తమ చెల్లెళ్లు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. రక్షా బంధన్ వేడుకలను రాజకీయ నాయకులు జరుపుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మహిళా ప్రజాప్రతినిధులు రాఖీ కట్టారు. వీరిలో మంత్రి సీతక్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ తో పాటు తదిరులు రాఖీ కట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండ సంజయ్ కుమార్ కు బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ దేవి రాఖీ కట్టారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు రాఖీ పండుగలో పాల్గొన్నారు.