తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రైతులు ఎంతో నెలల నుంచి ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’పై కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే దసరా నాటికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రైతు బ్యాంకు అకౌంట్లో వేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ పథకం పై పలు సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం దసరా నాటికి దీనిని ఫైనలైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే అక్టోబర్ లో రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేయనున్నాయి. అయితే దీనిపై రెండు రోజుల్లో కేబినేట్ సమావేశం నిర్వహించనున్నారు. ఆ తరువాత అధికారికంగా ప్రకటించన్నారు.
రైతులకు పెట్టుబడి సాయం అందించాలన్న ఉద్దేశంతో గత బీఆర్ఎస్ సర్కార్ ‘రైతు బంధు’ పేరిట ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు ఏడాదికి రూ. 15 వేలే ఇస్తానని హామీ ఇచ్చింది. ఆరు గ్యారెంటీల పథకాల్లో దీనిని కూడా చేర్చారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి విడతగా రైతు బంధు ద్వారానే పాత మొత్తాన్ని అందించారు. రైతు బంధు పథకంలో లోపాలు ఉన్నాయని, దీనిపై ప్రక్షాళన చేసి నిజమైన లబ్ధిదారులకు రైతు భరోసా డబ్బలుు అందజేస్తామని తెలిపింది.
ఇందులో భాగంగా గ్రామా గ్రామాన రైతుల అభిప్రాయాలు సేకరించారు. బీడు భూములు, సాగులో లేని భూములకు రైతు భరోనా తీసేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా వానాకాలం పంటకు రైతు భరోసా ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ సమయంలో రుణమాఫీ ప్రకటించడంతో ఆ విషయాన్ని పక్కనబెట్టారు. అయితే కొందరు రైతు భరోసాపై ఎటువంటి ప్రకటనలు చేయకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో మరో రోండు రోజుల్లో కేబినేట్ మీటింగ్ ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా కింద ప్రతీ పంటకు రూ.7,500 ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించింది. ఇలా ఏడాదికి రెండుసార్లు మొత్తం రూ.15,000 సాయం చేయనుంది. అయితే వానాకాలంకు సంబంధించిన భరోసా కలిసి వచ్చే పంట నాటికి ఇస్తారా? లేదా దసరాకు మొదటి విడద కింద పంపిణీ చేస్తారా? అనేది కీలకంగా మారింది. మరోవైపు రైతు కూలీల విషయంలో నూ ఓ నిర్ణయానికి రానున్నారు.