Tuesday, June 24, 2025

మహిళలకు గుడ్ న్యూస్.. కూర వండే మిషన్ కూడా వచ్చింది.. అదెలా ఉందో ఈ వీడియోలో చూడండి..

కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. నేటికాలంలో ప్రతి పనిని సాంకేతికంతో చేస్తున్నారు. ఈ టెక్నాలజీ ఫుడ్ రంగంలోకి కూడా వచ్చింది. ఇప్పటికే కొన్ని పనులను మిషన్లతో చేస్తున్నారు. ఒకప్పుడు చేతితో చేసి చపాతీలు ఇప్పుడు మిషన్ లో పిండి వేగానే అవి కావాల్సినవన్నీ ఇస్తుంటాయి. అలాగే ఇటీవల పాత్రలను శుభ్రం చేసే మిషన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా కూర వండే మిషన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితె..

కింద ఉన్న ఈ వీడియో ప్రకారం.. స్టౌ పై ఒక పాత్రను ఉంచారు. దాని చుట్టూ మిషన్ సెట్ చేసి ఉంటుంది. ఇందులో కూర వండేందుకు అవసరమైన పదార్థాలను ఉంచారు. అందులో ఏమేం వేయాలో ముందే సెట్ చేసుకొని ఉంచాలి. ఆ తరువాత మిషన్ ఆన్ చేస్తే ఒక కూరకు కావాల్సిన పదార్థాలను ఆ మిషన్ వేసుకుంటూ ఉంటుంది. అయితే మధ్యలో ఒకసారి మాత్రం కలియబెడుతూ ఉండాలి.

ఇప్పటికే అన్నం వండే.. చపాతీలు చేసే మిషన్లు వచ్చాయి. ఇప్పుడు కూర వండే మిషన్లు కూడా రావడంతో మహిళలతో పాటు కొందరు బ్యాచ్ లర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బ్యాచ్ లర్ లైఫ్ ను కొనసాగించేవారు బయట ఆహారం తినలేకపోతున్నారు. దీంతో కావాల్సిన పదార్థాన్ని మిషన్ ద్వారా చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోపై కొందరు ఆసక్తికర కామెంట్స్ చేశారు. కొందరు ఈ మిషన్ అందుబాటులోకి వస్తే చాలా మంది ఉపాధి కోల్పోతారని అంటున్నారు. మరికొంత మంది మాత్రం ఈజీగా వంట చేసుకోవచ్చని తెలుపుతున్నారు.

అయితే ఇది చైనాకు చెందిన మిషన్ లాగా తెలుస్తోంది. ఇది మన దగ్గరి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే కొందరు చేతితో వండిన వంటను మాత్రమే ఎక్కువగా ఇష్టపడుతారు. ఎందుకంటే ఇప్పటికే ఆహార విభాగంలో ఎన్నో మిషన్లు వచ్చినా.. ఎక్కువ శాతం మంది సాంప్రదాయ వంటలు మాత్రమే ఇష్టపడుతున్నారు. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

https://www.facebook.com/share/p/14o7ffeXMC/

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News